
అలాంటి నేపథ్యంలోనే.... తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిన తర్వాత... కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎక్కడ తిరుగులేకుండా పోయింది. ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు, కేంద్ర మంత్రి పదవులు అలాగే రాష్ట్ర మంత్రి పదవులు... వరుసబెట్టి వచ్చాయి.
ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అనేకసార్లు తెలంగాణ కోసం రాజీనామా కూడా చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఎప్పుడు రాజీనామా చేసిన..... అఖండ మెజారిటీతో విజయం సాధించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఒకానొక సమయంలో ఎమ్మెస్ సత్యనారాయణ సవాలు... విసిరి కేసీఆర్ ను పడగొట్టాలని స్కెచ్ లు వేశారు. అయినా కూడా కేసీఆర్ తగ్గలేదు.
కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెస్ అలాగే కేసీఆర్ బరిలో నిలుచున్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఉద్యమ తీరు మెచ్చిన కరీంనగర్ ప్రజలు అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించారు. మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తెరపైకి తీసుకువచ్చారు. ఇలా నీరు కారుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారి రాజీనామా చేసి... లేపే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సక్సెస్ అయి... చివరికి ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్లారు కేసీఆర్.
కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అన్న నినాదాన్ని.. ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లారు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఈ దెబ్బకు తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత... టిఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా మార్చేశారు కేసీఆర్. ఇలా ఓటమి ఎరుగని నాయకుడిగా 25 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. ఇవాళ్టితో 25 సంవత్సరాల వసంతంలోకి కూడా... గులాబీ పార్టీ అడుగుపెడుతోంది.