ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కు సంబంధించి తేదీలు కూడా విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు మొదట ఫీజు చెల్లింపు గడువుని ఏప్రిల్ 15 నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చని  అధికారులు తెలియజేశారు. కానీ ఇప్పుడు తాజాగా గడువును పొడిగిస్తూ మే 5వ తేదీ వరకు చివరి తేదీగా ఉంటుందని తెలియజేస్తున్నారు.


ఈ మేరకు ఈ విషయాన్ని విద్య మండలి కార్యదర్శి కృత్తికాశుక్ల తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైనా విద్యార్థులు ఫీజులు చెల్లించని వారు ఉంటే వారికి ఇదే చివరి అవకాశమని మరొకసారి పొడిగించే అవకాశం ఉండదంట కూడా తెలియజేశారు. ఇక సప్లమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగబోతున్నాయట. ఆయా తేదీలలో పరీక్షలు రోజుకు రెండు సెక్షన్లలో జరుగుతాయని.. ఉదయం 9 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఒక సెక్షను.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు మరొక సెక్షన్ జరగబోతున్నట్లు తెలియజేశారు.


ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు జరగబోతున్నాయని తెలియజేశారు. ఇక ప్రాక్టికల్స్ ఎగ్జామ్లో ఎవరైనా ఫెయిల్ అయిన లేకపోతే రాయలేకపోయిన వారికి మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇంటర్ అడ్వాన్స్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ కి సంబంధించి..


1). మే 12:సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్
2)మే 13: ఇంగ్లీష్ పేపర్ వన్
3). మే 14: మ్యాథ్స్ -1A, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్1
4). మే 15: మ్యాథ్స్ పేపర్ 1B, హిస్టరీ 1, జువాలజీ 1
5). మే 16: ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమీ పేపర్ వన్
7). మే 17: కెమిస్ట్రీ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ 1, మ్యూజిక్ పేపర్ 1
8). మే 19: లాజిక్ పేపర్ 1, మాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1
9). మే 20: జాగ్రఫీ పేపర్ 1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1

సెకండ్ ఇయర్ సప్లమెంటరీ:
1). మే 12:సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
2)మే 13: ఇంగ్లీష్ పేపర్ 2
3). మే 14: మ్యాథ్స్ -2A, బోటనీ పేపర్2, సివిక్స్ పేపర్2
4). మే 15: మ్యాథ్స్ పేపర్2B, హిస్టరీ2, జువాలజీ2
5). మే 16: ఫిజిక్స్ పేపర్2, ఎకానమీ పేపర్ 2
7). మే 17: కెమిస్ట్రీ పేపర్2, సోషియాలజీ పేపర్2, ఫైన్ ఆర్ట్స్2, మ్యూజిక్ పేపర్2
8). మే 19: లాజిక్ పేపర్2, మాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ 2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2
9). మే 20: జాగ్రఫీ పేపర్ 2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2


పూర్తి సమాచారం కోసం కాలేజీలను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: