నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ వయసు పెరిగినప్పటికీ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం అఖండ-2. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల క్రితమే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. 

హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చింది. ఈ నేపథ్యంలో హిందూపురంలోని పెద్దలు బాలకృష్ణకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు బాలకృష్ణ పాల్గొని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ఇవ్వాలని అది ప్రతి తెలుగు వాడి కోరిక అంటూ బాలకృష్ణ మాట్లాడారు. ఈ సభలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు.

బాలకృష్ణ కేవలం సినీ హీరో మాత్రమే కాదని నిజ జీవితంలో కూడా హీరో అంటూ కొనియాడారు. బాలకృష్ణ చిన్న పిల్లాడి లాంటివాడని అన్నారు. బాలకృష్ణ భార్య వసుందర చాలా అదృష్టవంతురాలని ఆమె వ్యాఖ్యానించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారని సునీత పేర్కొన్నారు. తన తండ్రి, చిన్నాన్న కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడినప్పుడు బసవతారకం ఆసపత్రిలోనే మెరుగైన వైద్యం అందించారని పరిటాల సునీత గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రి వాతావరణం చాలా బాగుంటుందని, దేవాలయంలో ఉన్నట్లుగా అనిపిస్తుందని, వైద్యులు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని పరిటాల సునీత వెల్లడించారు. ప్రస్తుతం సునీత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: