
విశ్వసనీయ సమాచారం మేరకు.. కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూమి సేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలు కూడా పూర్తి అయ్యి పంపు హౌస్ లో పనులను కూడా మొదలుపెట్టారు.. ఆ తర్వాతే పైపులకు సంబంధించిన బిల్లులను సైతం పెట్టాలి అంటూ మహబూబ్ నగర్ సిఈకి సీఎం చంద్రబాబు సూచించారు.. ఇక అక్కడ చేసినట్లు అనడానికి (కాలేశ్వరంలో ఇంతకు ముందు ఎస్ఈగ పనిచేశారు) కాలేశ్వరం బ్యారేజీ పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేశారని వాటిపైన కచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అయితే కేసులకు సంబంధం లేని వారు మాత్రం భయపడాల్సిన పని లేదంటూ భరోసా కూడా ఇచ్చారట.
అందుకే సీఎం రేవంత్ రెడ్డి ,సిఈ రమణారెడ్డికి అక్కడ చేసినట్టు ఇక్కడ చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారట. ముఖ్యంగా ప్రాజెక్టులు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పులు లేకుండా సరిచూసుకోవాలని గతంలో జరిగిన పొరపాట్లు వల్ల విజిలెన్స్ కేసులు నమోదవుతున్న దృష్ట్య జాగ్రత్తగా పని చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే ఉద్యోగుల వేతనాల పైన కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లగా అవసరం ఉన్నంతవరకు కాంటాక్ట్స్ సిబ్బందిని తీసుకోవాలంటూ దీనిపైన ఒక కమిటీ వేయాలని ప్రతిపాదనలు వచ్చిన తర్వాతే పరిశీలిస్తానంటూ తెలియజేశారట. అలాగే ప్రాజెక్టులకు ఓ అండ్ ఎం బిల్లులకు సైతం 75కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ తెలిపారు. శిక్షణ సంస్థల వారికి 10 కోట్ల రూపాయలు.. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి పనుల కోసం 10 కోట్ల రూపాయలు.. దేవదూతల ఎత్తిపోతల పూర్తికి 2 వేల కోట్ల రూపాయలు అవసరమంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారట.