
గతంలో ఆమోదం పొందిన 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి దశలో అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ విధానం పెట్టుబడుల అమలులో పారదర్శకతను, సమర్థతను పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యాటక రంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను చంద్రబాబు వివరించారు. హోటళ్లు, గదుల కొరత వల్ల పర్యాటకుల ఆకర్షణ తగ్గుతోందని, 50,000 హోటల్ గదులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తక్కువ ధరలతో గదులు అందుబాటులో ఉంటే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కారవాన్స్ పాలసీని అమలు చేస్తే పర్యాటకులకు కొత్త అనుభవం, రాష్ట్రానికి అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.
దేవాలయాలను సందర్శించే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కీలకమని చంద్రబాబు ఒక్కించారు. ఈ పెట్టుబడులు, విధానాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని, ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచుతాయని ఆయన నొక్కిచెప్పారు. ఈ ప్రాజెక్టుల విజయవంతమైన అమలు ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అగ్రగామిగా నిలపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. SIPB నిర్ణయాలు రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఊపును తీసుకొస్తాయని అంచనా.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు