
ఏపీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను తాజాగా అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవాలి...? ఎవరిని కలవకూడదు ? మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ అపాయింట్మెంట్ కచ్చితంగా ధనుంజయ రెడ్డి తోపాటు కృష్ణమోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిందే. లేకపోతే... జగన్మోహన్ రెడ్డిని కలవలేరు.
అంతా పవర్ఫుల్ వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని a31, a 32 కింద కేసులు బుక్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన నేపథ్యంలోనే పేర్ని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఇలా వరుసగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబును జైల్లో పెట్టినట్లే వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు