ప్రస్తుతం భారతదేశానికి పాకిస్థాన్ కు మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియడం లేదు. ఇదే తరుణంలో భారతదేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీ ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాంటి ఈ తరుణంలో దేశంలో రెండో రాజధాని పెడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే అంబేద్కర్ కూడా రెండవ రాజధాని ఉంటే దేశం డెవలప్ అవుతుందని చెప్పారు. మరి రెండవ రాజధాని ఏది చేస్తే బాగుంటుంది వివరాలు చూద్దాం.. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం మొదలుపెట్టిన యుద్ధం వల్ల ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇండ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ నుంచి ఢిల్లీపై డైరెక్ట్ గా బాంబులు వేసే క్షీపణులు ఉన్నాయి. అంతేకాదు ఒక క్షిపణి రెడీ చేసి ఢిల్లీపై ఎక్కు పెట్టారు. అణు బాంబులకు సంబంధించిన పదార్థాలు వాడినటువంటి క్షిపణి. 

కానీ మన ఆర్మీ దారిలోనే దాన్ని హర్యానా దగ్గర పడగొట్టేశారు. ఒకవేళ అది సక్సెస్ కాకపోయి ఉంటే ఢిల్లీపై ఆ క్షీపణి బాంబు పడి దారుణమైన పరిస్థితులు ఎదురయ్యేవి. దీన్ని బట్టి చూస్తే క్షిపణి ఢిల్లీపై వేసే అవకాశం  ఉంది. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం ఢిల్లీ పై తప్పకుండా ఏదో ఒక సమయంలో బాంబులు వేసే అవకాశం ఉందని, ఇదే సమయంలో మన దేశానికి ప్రత్యాన్మయంగా   మరో రాజధానిని చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో హైదరాబాద్ లేదా విశాఖపట్నం రాజధానిగా చేసుకోవాలని అంటున్నారు. బిజెపి నాయకులంతా ఇది గుర్తుపెట్టుకుని ఢిల్లీ వద్ద ఈ విషయాన్ని తెలియజేసి భవిష్యత్తులో మనకు ఉపయోగపడే రాజధాని తయారు చేయాలని అంటున్నారు.

 ఒకవేళ ప్రమాద పరిస్థితులు వస్తే ఢిల్లీ ఈ రాజధానిగా ఉండడం వల్ల మనకు దేశాన్ని పాలించే పరిస్థితులు అణువుగా ఉంటాయని మేధావులు అంటున్నారు. ఇక ఇదే కాకుండా ఢిల్లీలో పొల్యూషన్ ఓవర్ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలలో ఒక రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని  మేదావులు అంటున్నారు. ఇదే తరుణంలో విశాఖపట్నం కూడా వరదలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండవని అంటున్నారు. అన్నిటికీ సేఫ్ అయిన ప్లేస్ అంటే హైదరాబాద్ బాగుంటుందని నెటిజెన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఫ్యూచర్లో అయిన హైదరాబాద్ లేదా విశాఖపట్నం రాజధానిగా విరాజిల్లుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: