ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రజలు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కూడా స్లిప్టింగ్ కూడా చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. కొత్తగా వివాహమైన, లేకపోతే ఒకే కుటుంబం నుంచి వేరే కాపురం పెడుతున్న వారికి కూడా కార్డులలో మార్పులు చేసుకొనే సదుపాయాన్ని కలిగించేది. అయితే వీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ కేవైసీ, వీఆర్వో ,తహసిల్దార్ ఇలా మూడంచల వెరిఫికేషన్ జరుగుతుంది.


ఇలా మొత్తం మూడు ప్రక్రియలు పూర్తి అవ్వడానికి కనీసం నెలలో 21 రోజులు సమయం పడుతుందట. ఈ సమయంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క దరఖాస్తు ఏ స్టేజిలో ఉందో తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి మరి ఒక వెబ్ సైట్ కల్పించింది. ఆ వెబ్ సైట్ పేరు ఏపీ సేవ అధికారిక పోర్టల్ .. మనం  కొత్త రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తు యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు.


1).ముందుగా మనం https://vswsonline.ap.gov.in/ అనే వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి.

2).అలా చేసిన తర్వాత ఏపీ సేవాధికారిక పోర్టల్ ఓపెన్ అవుతుంది.. ఇక ఈ పోర్టల్ లో కుడివైపును భాగంలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని సెర్చింగ్ ఆప్షన్ కనిపిస్తుంది.


3).అక్కడ మనం రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న సమయంలో వచ్చిన నెంబర్ను నమోదు చేయాలి.


4).ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేస్తే అందులో వివరాలు కనిపిస్తాయి. అక్కడ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ ఏ అధికారి దగ్గర మన రేషన్ కార్డు స్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని రోజులలోపు ప్రక్రియ పూర్తి అవుతుందనే విషయాలను కూడా అక్కడ కనిపిస్తాయట.


5).ఇందుకు సంబంధించి అధికారికంగా ఈ వెబ్సైట్ని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకించి మరి లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: