యుగాంతం అని చాలా రోజుల నుండి వినిపిస్తున్న మాట.మనం పుట్టకముందు నుండే మన తాత తండ్రుల నుండి ఈ యుగాంతం అనే మాట వింటూనే ఉన్నాం. గతంలోనే యుగాంతం అవుతుంది అని వార్తలు వినిపించాయి. ఇక 2012లో కూడా యుగాంతం ఉంటుంది అని చెప్పారు.కానీ అది జరగలేదు.అయితే తాజాగా మరో రెండు రోజుల్లో యుగాంతం జరగబోతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఇంతకీ ఇందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. మరో రెండు రోజుల్లో యుగాంతం అంటే చాలామంది ఇది ఫేక్ వార్తలు అని కొట్టి పరేస్తారు. కానీ ఇందులో కాస్త నిజం కూడా ఉంది. ఎందుకంటే ఓ భారీ గ్రహ శకలం గంటకి 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తుంది.. ఈ గ్రహ శకలం పేరు 2003H4.. 

ఈ గ్రహ శకలం 100 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉండడంతో పాటు గంటకి 50 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకు రావడంతో అంత వేగంగా వస్తున్న ఈ గ్రహశకలం భూమికి చిన్న డ్యాష్ ఇచ్చినా కూడా భూమి మొత్తం నాశనం అవ్వడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ గ్రహ శకలం భూమిని ఢీకొనడానికి ఎంతో సమయం లేదని, మే 24న అంటే మరో రెండు రోజుల్లో ఈ గ్రహ శకలం భూమి వైపుకు వస్తుంది అని, మే 24 సాయంత్రం 4:07 నిమిషాలకు ఈ గ్రహ శకలం భూమిని ఢీకొనే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అయితే మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే.. ఈ గ్రహశకలం గురించి నాసా ఏం చెప్పిందంటే.. భూమికి అత్యంత సమీపం నుండి ఈ గ్రహ శకలం వెళుతుంది..

కానీ భూమిని ఢీకొనే ఛాన్స్ మాత్రం చాలా తక్కువ ఉంది అని  తేల్చి చెప్పింది.కానీ అదే టైంలో ఢీకొన్నా కూడా చేసేదేమీ లేదని చెప్పారు. ప్రమాదం జరగదు అని కూడా చెప్పలేమని నాసా చెప్పడంతో చాలామంది ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు ఈ గ్రహ శాఖ భూమికి దగ్గరగా వచ్చిన టైంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఆకాశం మరింత ప్రకాశవంతంగా మారుతుందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మే 24 న చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ తెలిసిన చాలామంది జనాలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: