ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా , ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ సారి ముఖ్యమంత్రి గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఇంత గొప్ప రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు విషయంలో ఒక మంచి టాక్ కూడా ఉంది. అది ఏమిటి అంటే ..? చంద్రబాబు నాయుడు ఎక్కువ శాతం హామీలు ఇవ్వడు ... ఒక వేళ హామీలు ఇస్తే అవి తీర్చడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపుతాడు అని. ఇకపోతే ప్రస్తుతం కడప జిల్లాలో మహానాడు సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు తల్లులకు , రైతులకు ఒక గొప్ప హామీ ఇచ్చాడు. తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తాము అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే ఒక్కో స్టూడెంట్ కి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక కుటుంబం లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్న అంత మంది కి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అలాగే మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు కూడా శుభవార్త చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 20 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఈ సహాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేస్తాము అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇలా కడపలో జరుగుతున్న మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తల్లులకి , రైతులకు శుభవార్తను చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: