గత పది రోజుల క్రితం హైదరాబాదులోని పాత బస్తిలో ఉన్న గుల్లార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 17 మంది అగ్నికి ఆహుతైన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా అగ్ని ప్రమాదానికి గురైన బాధితులు మీడియా ముందుకు వచ్చి సంచలన నిజాలు చెప్పారు. వైద్యుల, అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అంటూ వాళ్ళు చెప్పిన మాటలు ప్రస్తుతం చాలామందికి షాకింగ్ గా అనిపిస్తున్నాయి.మరి ఇంతకీ ఆ బాధితులు ఏం మాట్లాడారంటే.. అగ్ని ప్రమాదం జరిగిన రోజు దాదాపు 6:12 కు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి లేట్ అయింది. అలా దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అంబులెన్స్ ఆలస్యం చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు వదిలారు. అలాగే అంబులెన్స్ లో ఆక్సిజన్ మాస్కుల సదుపాయం కూడా లేదు. ఫైర్ ఇంజన్ కూడా తొందరగా రాలేదు.


ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసాక చాలా ఆలస్యంగా వచ్చింది. అంతేకాదు ఫైర్ ఇంజన్ వచ్చినా కూడా నీళ్లు లేవని ప్రెషర్ రాలేదని  నిర్లక్ష్యం చేశారు. వారి నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎక్కువ ప్రాణాలు పోయాయి. ఫైర్ ఇంజన్ వాళ్ళ దగ్గర కనీసం టార్చ్ లైట్, కావలసిన పరికరాలు కూడా లేవు.. ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకువెళ్లాక ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరో ముగ్గురు మరణించారు. ఇదంతా వైద్యుల నిర్లక్ష్యమే.. ఫైర్ ఇంజన్ వచ్చాక ఐదు నిమిషాల్లో మంటలు ఆర్పేస్తే ఎంతోమంది బతికేవారు. కానీ నీళ్లు లేవని డొంకతిరుగుడు సమాధానాలు చెప్పి అమాయకపు ప్రాణాలు పోయేలా చేశారు. ఘటన స్థలానికి వచ్చిన కానిస్టేబుల్ కూడా ఏమీ చేయకుండా సైలెంట్ గా అక్కde నిల్చొని ఉన్నారు. అలాగే ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లిన సమయంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయకుంటే వైద్యం చేయమని తేల్చి చెప్పారు.

దాంతో చేసేదేమీ లేక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది. మా కుటుంబంలోని ఇంతమంది ప్రాణాలకు కారణం ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులే అంటూ గుల్జార్ హౌస్ బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.అంతేకాదు  అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే మా కుటుంబంలో 17 మంది చనిపోయారని చెప్పుకొచ్చారు.అలాగే ఈ ఘటన జరిగాక వచ్చి చాలామంది ప్రభుత్వ అధికారులు మాట్లాడిన మాటలు మమ్మల్ని మరింత కుంగదీసాయి అంటూ చెప్పారు. అంతేకాదు గుల్జార్ హౌస్ లో జరిగిన ఘటనపై న్యాయ విచారణ చేసి చనిపోయిన కుటుంబాలకు సహాయం చేయాలి అని డిమాండ్ చేశారు.మరి గుల్జార్ హౌస్ బాదితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: