
ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, ఎరిట్రియా, మయన్మార్, కాంగో, హైతి, చాడ్, ఈక్వట్టోరియల్ గినియా, ఇరాన్, సుడాన్, సోమాలియా, మెయిన్ వంటి పన్నెండు దేశ పౌరులను అమెరికాలో ప్రవేశించడం పూర్తిగా నిషేధించారు. ఈ దేశ పౌరులు ఇకమీదట అమెరికాలోకి ఎంట్రీ లేదట. వీటికి తోడు ట్రంప్ మరొక ఏడు దేశాలను నుంచి వచ్చే వారిపైన పలు రకాల కఠినమైన ఆశలు కూడా విధించినట్లు తెలుస్తోంది.. అందులో టోగో, లావోస్, బురుండి, క్యూబా, తుర్మోనిస్తాన్, వెనిజులా వంటి దేశాలకు కఠినమైన ఆంక్షలు విధించారు అయితే ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా ఇలాంటివి జరిగాయట.
అయితే ఈ విషయం పైన డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికా జాతీయ భద్రతను తన పౌరులను కాపాడుకోవడానికి తాను ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అంటే ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎవరూ కూడా అమెరికాలో ప్రవేశించడానికి వీలు లేకుండా ఉండేందుకు ఇలా చేశామంటూ తెలిపారు. అయితే ఈసారి ఆంక్షలు వలన వీసాలకు మాత్రమే కాకుండా..
1).B-1.. వ్యాపారం
2).B -2.. పర్యటకం
3).f - విద్యార్థి
4).m - వృత్తి
5).j - మార్పిడి కార్యక్రమం
వంటి వీసాలకు కూడా కఠినమైన చర్యలు వర్తింపచేసేలా చేశారు.
ఇక ఆంక్షలు కారణాల విషయానికి వస్తే..
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ నియంత్రణ.. క్యూబా, ఇరాక్ రాష్ట్ర ప్రయోజత ఉగ్రవాదం.. చాడ్ B1/B2 వీసాలకు..49.54% వరకు ఓవర్ స్టే రేటు ఉండడం, అలాగే ఎరిట్రియాలో F,M ,J వీసా దారులకు 55.43% వరకు ఓవర్ స్టే రేటు ఉండడమట.