మాజీ సీఎం వైఎస్ జగన్ పై ప్రజల్లో ఊహించని స్థాయిలో నెగిటివిటీ ఉందనే సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్న సమయంలో అనుభవ లేమితో చేసిన తప్పులు ఆయన పాలిట శాపమయ్యాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పై ప్రజల్లో ఎందుకింత నెగిటివిటీ అని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేసినా నిందలేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 
జగన్ ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. సంక్షేమ పథకాలకే జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఫెయిలయ్యారు. సరైన సలహాదారులు లేకపోవడం కూడా జగన్ కు ఒక విధంగా మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. జగన్ కొన్ని విషయాల్లో ఇప్పటికే మారినా ఫలితం లేకుండా పోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవడానికి జగన్ ఏ విధంగా అడుగులు వేస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాబోయే రోజుల్లో రాజకీయాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతారేమో చూడాల్సి ఉంది. జగన్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త పథకాలను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. జగన్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
 
జగన్ కు ప్రస్తుతం సరైన స్ట్రాటజిస్ట్ లు అవసరం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు మళ్లీ ప్రజల మద్దతు దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: