ప్రధానంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా గట్టి హాట్ టాపిక్ గా మారుతుంది .. ఇలా గాల్లోకి వెళ్లి కొంత దూరం లేచి అలా కూలిపోయింది విమానం.. అసలు కొంత దూరం కూడా పైకి ఎగరలేకపోయింది అంటే విమాన వ్యవస్థ మొత్తం సెకండ్లలోనే క్రాష్ అయిపోయింది .. సాధారణంగా విమానాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ లాండింగ్ చేసుకొనేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి .. అలాగే గాల్లో పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోవటం అనేది దాదాపు కుదరదు .. కానీ పూర్తిగా గాలిలోకి ఎగరకముందే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం పైలెట్ నియంత్రణ కోల్పోవడం కాదు అసలు పూర్తిగా గాలిపటంలా మారిపోయింది .

అయితే ఇంత ఘోరమైన సిచువేషన్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం మానవ తప్పిదమని చెప్పాల్సిన పని కూడా లేదు .. ఈ ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని .. ఏసీలు పనిచేయలేదని తాము ముందే చెప్పామని అంతకుముందు అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో చెబుతున్నారు .. ఇంకా చాలామంది ఆ ఫ్లైట్ గత హిస్టరీని బయటకు తీశారు .. కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని ఇటీవల ఆ విమానానికి రిపేర్లు చేయించారని వాటిలో  లోపాలు ఉన్నాయని కూడా చెప్పటం మొదలుపెట్టారు .  

అయితే నిజానికి ఇవన్నీ మానవ తప్పిదాలే .. విమానాల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా చూస్తారు .. ఎలాంటి ఏ చిన్న లోపం ఉండడానికి ఎక్కడ అనుమతించరు . కానీ చేసే పనుల్లో స్థిరత్వం జడత్వం వస్తే ఎంత సిబ్బందికైనా .. రోజు చెక్ చేసేదే కదా ఈరోజు చెక్ చేయకపోతే ఏమవుతుందని అనుకోవటమే చెక్ చేసినట్లుగా నటించడమే చేస్తే చిన్న చిన్న లోపాలు పెద్ద‌ ప్రమాదాలకు దారితీస్తాయి .. చిన్న‌ దే కదా రేపైనా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకుంటే మొదటకే మోసం వచ్చేస్తుంది .. అహ్మదాబాద్ లో జరిగింది కూడా అలాంటిదే అని నిపుణులు అంటున్నారు .

విమానంలో సాంకేతికలోపాలు .. మొత్తం విమానం  ఇంజిన్లను ప్రభావేతం చేశాయంటే ఈ నిర్వహణ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అంతా అర్థం చేసుకోవచ్చు .. అలాగే ఈ ప్రమాదం వందల మంది ప్రాణాలను కూడా గాల్లో కలిపేసింది .. ఇక్కడ ప్రతి ఒక్కరిది ఒక్కొ క‌థ , ఒక్కో జీవితం, వారి మీద ఆధారపడిన వారు ఎందరో ఆ కథల్ని వింటే ఎవరికైనా ఏడుపు రాకుండా ఉండదు .. ఇక మరి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏ విషయంలో అయినా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతిదీ ఎంతో సీరియస్ గా తీసుకోవాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: