అసలు అమలు చేస్తారా చేయరా ? అనే లక్షల ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ లో కీలకమైన తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 67 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 8745 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది సహజంగానే చంద్రబాబు రాజకీయ వ్యూహానికి పెద్ద సవాలు.. ఎందుకంటే ఇదే సొమ్ము ఉంటే పోలవరంలో పాతిక శాతం పనులు అవుతాయి .. అమరావతిలో రెండు పెద్ద భవనాలు ఏర్పడతాయి. కానీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు ఈ సొమ్మును ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి నిబంధనలు విధి విధానాలు కూడా పెద్దగా మార్పులు లేకుండానే విడుదల చేశారు. గత వైసిపి హయాంలో ఎలాంటి నిబంధనలు పెట్టారో ?ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాంటి నిబంధనలు పెడుతున్నారు. మరోవైపు కీలక విషయం ఏంటంటే 15000 ఇస్తామని ఒక్క రూపాయి కూడా కట్ చేయమని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యాయి.


గతంలో వైసిపి 14000 ఒకసారి 13000 మరో మూడు సార్లు ఇచ్చింది. ఇప్పుడు కూటమి 13 వేల తో ప్రారంభించింది. గతంలో వైసిపి ఇచ్చినట్టే ఇప్పుడు అమలు కావటం .. దానికి తోడు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న అందరికీ తలా 13000 ఇవ్వడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా చూస్తే తల్లికి వందనం పథకంతో సర్కారు గ్రాఫ్ అయితే పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అసలు ఇవ్వ‌ర‌న్న ప్రచారం నుంచి ఇస్తారన్న ప్రచారం దాకా ఇచ్చేవరకు తీసుకువచ్చిన పథకం ఇది. పేదల కుటుంబాల్లో పండుగ వచ్చేలా చేసిందని చెప్పాలి. దీనికి విధించిన నిబంధనలు తీసుకుంటే పెద్దగా వ్యతిరేకత రాలేదు. చంద్రబాబు మేలు చేస్తారన్న అభిప్రాయాలే ఎక్కువ మంది నుంచి వ‌చ్చాయి. సో ఈ పథకం ప్రభుత్వం గ్రాఫ్ కొంత వరకు పెంచింది అనటంలో ఎలాంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: