గత ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో లిక్కర్ స్కాం లో వసూళ్లు చేసిన వందల కోట్ల నగదును గత ఎన్నికల్లో పంపిణీ చేసినందుకు మాస్టర్ ప్లాన్ తో వ్యవహరించినట్లుగా పోలీసులకు ఆధారాలు దొరికినట్లుగా తెలియగానే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. పోలీసులతోనే విచిత్రమైన డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు .. ఆ సమయంలో ఆ డబ్బులు పంచడానికి పంపిణీ దారులుగా వాడుకున్న కిందిస్థాయి పోలీస్ ఉద్యోగులతో సరికొత్త డ్రామాలు చేస్తున్నారు .. అయితే ఇక్కడ ఆయన పోలీసులతో పెట్టుకున్నారన్న విషయాన్ని మర్చిపోయారు .. అచ్చంగా మరో వైసీపీ నేత వంశీ చేసిన తప్పే చెవిరెడ్డి చేసి దొరికిపోయారు .. ఇప్పుడు అసలు సినిమా మొదలు పెట్టేందుకు సీట్ సిద్ధమైంది .

చెవిరెడ్డి దగ్గర దాదాపు 10 ఏళ్ల పాటు గన్మెన్ గా పనిచేసిన మదన్ రెడ్డిని అధికారులు విచారించారు .. అలాగే మదన్ రెడ్డి పోలీస్ ట్యాగ్ పెట్టుకుని వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి చెప్పినవన్నీ చేస్తున్నట్లుగా గుర్తించారు .. ఇక దాంతో మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణ చేస్తూ ఓ లేఖను కూడా రాయించాడు అందులో సిట్ అధికారులు కొట్టారని తాము చెప్పినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వమన్నారు అని కూడా చెప్పారు .. అంతేకాకుండా మరో గన్మెన్ తాము చెప్పినట్లే స్టేట్మెంట్ ఇచ్చారని సిట్ అధికారులు చెప్పారని మదన్ రెడ్డి అందులో చెప్పుకొచ్చారు .. అయితే ఇక్కడ మరీ ఇంత కామెడీగా మదన్ రెడ్డికి అధికారులు అలా చెబుతారా ? అలాగే ఆస్పత్రిలో జాయిన్ అయినట్టుగా ఫోటోని కూడా మదన్ రెడ్డి విడుదల చేశారు ..

అయితే ఇది పూర్తిగా వైసిపి కుట్రపూరితమని సిట్ అధికారులకు క్లారిటీ వచ్చేసింది .. అలాగే మదన్ రెడ్డితో ఎలా వ్యవహరించారో వారికి బాగా తెలుసు అందుకే దీని వెనక ఉన్న అసలు  కుట్రను బయటకు తీయడానికి రెడీ అవుతున్నారు . అలాగే ఎవరి అండ దండలతో ఇలా మదన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారో కూడా వారీకి తెలుసు దానికి ఆధారాలు కూడా సేకరించారు .. అయితే ఈ విషయం పై క్లారిటీ రావటంతో రేపే మాపో అరెస్ట్ చేస్తారని డౌట్ పడిన చెవిరెడ్డి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు .. అలా బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ లుక్ అవుట్ నోటీసు ఉండటంతో అక్కడ దొరికిపోయారు .. ఇప్పుడు సీట్ దీని వెనక ఉన్న అసలు కుట్రల కథను బయట పెట్టనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: