ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతుండటం గత కొంతకాలంగా సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో కొడాలి నాని చేరారు.  కొంతకాలం క్రితం ఏపీ పోలీసులు  కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  కోల్ కతా నుంచి  కొలంబో వెళ్తున్న కొడాలి నానిని  ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని  వివరాలు తెలియాల్సి ఉంది.

గత కొంతకాలంగా కొడాలి నాని  అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా  ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.  చికిత్స అనంతరం  కోల్ కతాకు వెళ్లిన ఆయన అక్కడినుండి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.   రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో   కొడాలి నాని  చేసిన కామెంట్లు వేర్వేరు సందర్భాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

ప్రస్తుతం వల్లభనేని వంశీ జైలులో ఉండగా ఆయనను టార్గెట్ చేసి చుక్కలు చూపిస్తున్నారని  ఏపీ  పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.  రాబోయే రోజుల్లో కొడాలి నాని  సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కొడాలి నాని  ప్రవర్తన తీరు వల్ల ఆయన అరెస్ట్ అయినా నెటిజన్ల నుంచి పాజిటివ్ స్పందన అయితే వ్యక్తం కావడం లేదని  చెప్పవచ్చు.  మరోవైపు కొడాలి నాని  రాజకీయాలలో కొనసాగడానికి సైతం ఆసక్తి చూపడం లేదు.

కొడాలి నాని  అరెస్ట్ కావడంతో ఈ కేసు  ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.  కొడాలి నాని  మట్టి, ఇసుక ఇతర అక్రమ రవాణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే ఉన్నాయి.  కొడాలి నానిపై  నమోదైన కేసుల విషయంలో  విజిలెన్స్ విచారణలు  కొనసాగుతున్నాయి.  కొడాలి నాని  పాపం పండిందని  అందుకే ఆయన అరెస్ట్ అయ్యాడని  ఇతర పార్టీల నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల అరెస్టులపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: