మాజీ సీఎం జగన్ కు ఏపీ ప్రజల్లో క్రేజ్, ఫాలోయింగ్,  పాపులారిటీ  అంతకంతకూ పెరుగుతోందా అనే  ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.  జగన్ సత్తెనపల్లి టూర్  అయితే కన్ఫామ్ అని వైసీపీ చెబుతోంది.  అయితే వైసీపీకి  సంబంధిచి అనుమతులకు సంబంధించి ఇంకా గందరగోళం ఉందని పోలీసులు చెబుతున్నారు.  మేము 100 మందికి మాత్రమే అనుమతించగలమని పోలీసులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం .

ఆ ఉరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వెళ్లినా  100  మందిని తీసుకొని వెళ్లినా  జగన్ పై  అభిమానంతో వచ్ఛే  వాళ్ళు  మాత్రం వేల సంఖ్యలోనే ఉంటారు. జగన్ పై  అభిమానంతో వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం ఆయనకు ఎలా సాధ్యమవుతుంది.   పోలీసులు జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడం ద్వారా జగన్ ఇమేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఐతే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు ముందుగానే వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం విషయంలో వైసీపీ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  జగన్ కు ఇబ్బందులు క్రియేట్ చేయడం ద్వారా జగన్ ను హీరోను చేస్తున్నారని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం జగన్ టూర్ తో జూదం ఆడుతున్నారా అని మరి కొందరు  అభిప్రాయపడుతున్నారు.  వైసీపీ  ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుకు  వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

శాంతియుతంగా  జగన్ తో పాటు వెళ్లి నాగ మల్లేశ్వరరావుకు ఘనమైన నివాళులు అర్పిద్దామని వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చారు.  జగన్ పర్యటన  కూటమి శ్రేణులను భయాందోళనకు గురి చేస్తోందని  జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులను సృష్టిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కు చేటు  చేయాలని భావిస్తే పార్టీకి తీరని  నష్టం కలుగుతుందని  టీడీపీ నేతలు ఆలోచించడం లేదు. భవిష్యత్తులో  జగన్ పర్యటనల విషయంలో ఇదే తీరు కొనసాగుతుందేమో చూడాల్సి ఉంది. అడ్డంకులు ఎదురైన పక్షంలో జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: