ఇక తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది .. రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆయన స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తుంది .. ఈ మేరకు ఇప్పటికే పార్టీలు చర్చలు కూడా మొదలుపెట్టాయి .. సిట్టింగ్ సిట్ ను బీఆర్ఎస్ కాపాడుకోవడానికి సెంటిమెంట్ అస్త్రం బయటకు తీయనుంది .. కంటోన్మెంట్ తరహా లోనే ఈ సీట్లో విజయం సాధించాలని కాంగ్రెస్ గ‌ట్టి కస‌ర‌త్తు చేస్తుంది .. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా ఈ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. మిత్రపక్షలు అయ‌న‌ జనసేనతో పాటుగా బిజెపితో చర్చలు జరుగుతుంది .. అలాగే పోటీ అభ్యర్థ పైన కూడా ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం ..


జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక పైన ప్రధాన పార్టీలు గట్టి చర్చలు లెక్కలు ఇప్పటికే మొదలుపెట్టాయి .. అయితే జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక అక్టోబర్ నెల చివర్లో జరిగే అవకాశం ఉంది .  అలాగే దీనికి సంబంధించిన షెడ్యూల్ సెప్టెంబర్ లో విడుదల చేస్తారని అంచ‌నా . ఇక గతంలో కంటోన్మెంట్ సీటు తరహాలోనే జూబ్లీహిల్స్ స్థానం గెలుచుకోవాలని కాంగ్రెస్ గట్టి కసురత్తులు చేస్తుంది . ఇప్పటికే ఆ స్థానంలో పరిస్థితులను అధ్యయనం  చేసెంద‌కు  పొన్నం ప్రభాకర్ , తుమ్మల నాగేశ్వరరావు , వివేక్ తో సీఎం రేవంత్ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు  .. అయితే 2009 లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం  నుంచి మాగంటి గోపీనాథ్ మూడుసార్లు విజయం సాధించారు .. 2014లో టిడిపి నుంచి గేల‌వ‌గా ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు అలా 2018 - 23 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు ..


అయితే ఖైరతాబాద్ నుంచి విడిపోయి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటయింది .. అలా 2009లో జరిగిన ఎన్నికల్లో పి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు .  ఇక ఇప్పుడూ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అజహరుద్దీన్ , పిజెఆర్ కుమ‌ర్తె విజయ రెడ్డి , నవీన్ యాదవ్ పేర్లు పరీశీల‌న‌లో ఉన్నాయి .. అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటింగ్ ఎంతో కీలకంగా ఉన్నాయి .. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య పోటీపైన అంగీకారం కుదిరితే ఇక్కడ లెక్క మొత్తం మారే అవకాశం ఉంది .  ఇదే క్రమంలో మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి బీఆర్ఎస్ పోటీకి దించాలని ప్రయత్నాలు చేస్తుంది .. అది కుదరకపోతే మాజీ ఎమ్మెల్యే విష్ణుకు సీటు కేటాయించే అవకాశం ఉంది .. అయితే ఇప్పుడు ఈసారి ఊహించ‌ని విధంగా తెలుగుదేశం సైతం ఈ నియోజకవర్గంలో పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు ప్ర‌స్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నయని భావిస్తున్నారు .


మాగంటి గోపీనాథ్ చనిపోయిన సమయంలో ఏపీ మంత్రి లోకేష్ మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు .  అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన ఎన్డీఏను తెలంగాణలోనూ బలపరచాలని ప్రతిపాదన గట్టిగా నడుస్తుంది .. ఇక త్వరలో గ్రేటర్ ఎన్నికలు కూడా జరగబోతున్నయి  ఈ దీనికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికతోనే ఈ పొత్తును మొదలు పెట్టాలని ఆలోచన గట్టిగా జరుగుతుంది .  ఇక దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ లో టిడిపి , జనసేన , బిజెపి కూటమి అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నారు .  ఇక అందులో భాగంగానే టిడిపి నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో గట్టి ప్రచారం నడుస్తుంది .  అలాగే టిడిపిలో సుహాసిని క్రియాశీలకంగా రాజకీయాలు చేస్తున్నారు .. అలాగే నందమూరి వారసురాలకు సీటు ఇస్తే కలిసి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు .. ఇదే క్రమంలో బిజెపి కూడా ఇక్కడ నుంచి దీపక్ రెడ్డిని పోటీ పెట్టాలని భావిస్తుంది .. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనపైన మూడు పార్టీల అధినాయకత్వం చర్చించి  .. తుది నిర్ణయం తీసుకోబోతున్నాయి.. అయితే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా తెలంగాణలో కొత్త రాజకీయం మొదలు కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: