మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం సీఎం చంద్రబాబు ఎవరికి తేలియ‌ని ఓ మహా  యజ్ఞమే చేస్తున్నారని చెప్పాలి .. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి చంద్రబాబు 4.O  ప్రభుత్వంలో ప్రధాని మోడీకి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు .. అలాగే దాదాపు కీలక‌ అంశాల విషయంలో మోడీకి తెలియకుండా ఆయన ఏ పని చేయటం లేదన్న చర్చ కూడా ఉంది .. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించడం దగ్గర నుంచి విశాఖలో నిర్వహిస్తున్న యోగ దినోత్సవం వరకు చంద్రబాబు ఎంతో పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు . అలాగే సాధారణంగా మోడీ బయట పర్యటనకు వచ్చినప్పుడు కూడా .. తన సొంత చెఫ్‌ను వెంటబెట్టుకుని వస్తారు ..


ఆయన తన విమానంలో ఆయనతోనే వంట చేయించుకుంటారు .. కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి పనుల పూనః ప్రారంభించడానికి వచ్చినపుడు మాత్రం చంద్రబాబు చేయించిన వంటకాల్ని ఆయన ఎంతో ఆప్యాయంగా తిన్నారు .. అలా చేశారంటే చంద్రబాబు పై ఆయనకు , మోడీపై చంద్రబాబుకు ఉన్న ప్రాధాన్యం ఈ వ్యవహారం స్పష్టం చేస్తుంది .. ఇక నిజాని కి ఈ ఇద్దరికి ఉన్న పరస్పర రాజకీయ ప్రయోజనాలు కూడా ఇద్దరినీ కలిపి ఉంచయని కూడా చెప్పాలి .కేంద్రంలో బలమైన మద్దతు మోడీకి లేదు .. పైగా ప్రస్తుత మిత్రపక్షాల్లో బీహార్ జేడీయూ అంత నమ్మశక్యం కాని మిత్రపక్షం .. దీంతో ఎక్కువ మోడీ ఆశలు కూడా ఏపీ పైనే ఉన్నాయి .. రేపు ఏదైనా తేడా వచ్చినా ఏపీ ఆదుకుంటుంద‌న్న ధీమా ఆయనలో ఉంది .. ఇక ఏపీలో కూడా వైసీపీని కట్టడి చేయాలంటే కచ్చితంగా కేంద్రం బలం అవసరమని గుర్తించిన చంద్రబాబు లోకల్ గా కన్నా ఢిల్లీ తోనే బెస్ట్ అనిపించుకునే పరిస్థితుల్లో  ఆయన వ్యవహార శైలి ఉంది .


ఇక ఈ క్రమంలోని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు .. ఇక ప్రస్తుతం ఈనెల 21న జరగనున్న ప్రపంచ యోగ దినోత్సవానికి ఏపీ ఆతిథ్యం ఇవ్వనన్న నేపథ్యంలో విశాఖలో దీనిని ఏర్పాటు చేశారు .. అయితే ఈ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించిన నాటి నుంచి చంద్రబాబు ఎంతో ప్రత్యేకత తీసుకుంటున్నారు .. అన్ని విషయాల్లో తానే చూసుకుంటున్నారు ఎక్కడ చిన్న పొరపాటు రాకుండా స్వయంగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు .. అలాగే ప్రతి విషయాన్ని అడిగి అందరి దగ్గర తెలుసుకుంటున్నారు .. ఒక విధంగా చెప్పాలంటే మోడీ కోసం చంద్రబాబు ఓ పెద్ద యజ్ఞమే చేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు .. అయితే దీని తాలూకు ఫలితం 20029లో కలిసి వస్తుందని వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: