
కూటమి అధికారంలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత దక్క లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిని తెలియజేశారు సుగువాసి కుటుంబ సభ్యులు. దీంతో అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షుడు జగన్మోహన్ రాజాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.. నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన సుగవాసి పాలకొండ్రాయుడు మరణిస్తే కనీసం పార్టీ తరఫునుంచి ఒకరు కూడా అంతక్రియలలో పాల్గొనలేకపోవడంతో కుటుంబాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఈ నేపథ్యంలోనే టిడిపిలో కొనసాగడం కూడా చాలా వృధా అని నిర్ణయాన్ని తీసుకున్న సుగవాసి కుటుంబ సభ్యులు.. కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీని వీడారు..అన్నమయ్య జిల్లా బలిజి సామాజిక వర్గంలో మంచి ప్రాధాన్యత కలిగి ఉన్న కుటుంబం. అలాగే రాయచోటిలో సుగవాసి కుటుంబానికి కూడా రాజకీయంగా బాగానే బలం ఉన్నది. కారణాలు ఏమైనా టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి పార్టీలోకి ఈ బడా ఫ్యామిలీ వెళ్లడం ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది. వైసిపి పార్టీలోకి చేరిన తర్వాత అన్నమయ్య జిల్లాలు ప్రతి గడపకు వెళ్లి తమకు జరిగిన అన్యాయాల గురించి పెద్ద ఎత్తున ప్రజలకు చెబుతామంటూ సుగవాసి సుబ్రహ్మణ్యం తెలియచేస్తున్నారు.