దేశంలో  జమిలి ఎన్నికలను తీసుకురావాలని  కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల ద్వారా  ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ  జమిలి ఎన్నికలు నిర్వహిస్తే శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్లక్ష్యానికి గురవుతాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. అలాగే ప్రజలు కూడా జమిలీ ఎలక్షన్స్ అంటే కాస్త విముఖత చూపిస్తున్నారు. ఈ  జమిలి ఎన్నికలు నిర్వహిస్తే  కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే లాభం చేకూరుతుంది, ప్రాంతీయ పార్టీలన్నీ తుడిచి పెట్టుకుపోతాయని  నిపుణులు అంటున్నారు. 

అలాగే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే మూడు రేట్ల అధిక ఖర్చవుతుందని అంటున్నారు. ఈ విధంగా జమిలి ఎన్నికల ప్రస్తావన ఎన్నిసార్లు కేంద్రం తీసుకువచ్చినా ఎలక్షన్స్  మాత్రం జరగడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు జరగాలంటే జనాభా లెక్కలు పూర్తవ్వాలి. 2027లో పూర్తిగా జనాభా లెక్కలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగి, 2029 లో 16 రాష్ట్రాలకి , 2034 లోనే మొత్తానికి ఎలక్షన్స్ జరపాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా జమిలి ఎన్నికలపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

2027 ఫిబ్రవరిలో  జమిలి ఎన్నికలు వస్తున్నాయని  ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ విధమైన కామెంట్స్ ఆయన చేయడంతో మరోసారి జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.తేకాకుండా జమిలి ఎన్నికలు ఒక్కసారి దేశంలో జరిగితే డైరెక్ట్ గా ప్రధానిని ఎన్నుకోవచ్చు. అంతేకాదు ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నికలకు కోడ్ అమలు అవుతూ ఉంటుంది.  కానీ జమిలి ఎన్నికల వల్ల ఒకేసారి ఎన్నికల కోడ్ అమలై ఎన్నికలు ముగిసిపోతాయి. దీనివల్ల ప్రజలకు కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, చాలా స్పీడ్ గా ఎన్నికలు ముగుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: