
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో నాన్ సీరియస్ గా ఉంటూ .. పార్టీ .. ప్రజలు పట్టని ఎమ్మెల్యేల లెక్క తేల్చే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ప్రజల పనులు .. పార్టీ పనులు ఎమ్మెల్యే గా బాధ్యతల నిర్వహణలో సీరియస్ నెస్ లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఎవరు అయితే ఎక్కువుగా ప్రాధాన్యత ఇస్తున్నారో వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేయనున్నారు. అవసరం అయితే వారిని అమరావతికి పిలిపించి వారితో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రెండో తేదీ నుంచి టీడీపీ నిర్వహించే యేడాది పాలన విజయాల ప్రచార కార్యక్రమంపై చంద్రబాబు తాజాగా నిర్వహించిన సమావేశానికి కూడా ఏకంగా 15 మంది పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేశారు. మొత్తం ఆహ్వానాలు పంపిన వారిలో ఏకంగా 50 మంది వరకు రాలేదు.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తరచూ విదేశీ పర్యటలనకు వెళ్లే వాళ్లు ... నాటా , టాటా సభలక టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి గురించి కూడా తనకు తెలుసు అని చంద్రబాబు అన్నారు. అలాంటి ఎమ్మెల్యేల కు తాను టాటా చెప్పేస్తానని హెచ్చరించారు. చంద్రబాబు ఇక పై పార్టీ పరమైన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే సహించకూడదని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీరియస్ గా తీసుకోని వారి విషయంలో.. తర్వాత ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం ఉండదని కూడా బాబు వార్నింగ్ ఇస్తున్నారట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు