
దివ్యాంగుల సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 వేల రూపాయలకు పైగా అందుకున్నారని ఆరోపణలు కూడా వినిపించాయని అందుకే పింఛనీలలో అన్నిటినీ వెరిఫికేషన్ చేస్తున్నట్లుగా తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో వినికిడిలో పుంతోపాటు మానసిక సమస్యలు ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్లను పొందారని రాష్ట్రవ్యాప్తంగా 6000 రూపాయల చొప్పున..7.86 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు.
దివ్యాంగులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారికి కూటమి ప్రభుత్వం 15000 పింఛన్ ఇస్తోంది. వీరిలో కూడా చాలామంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగవైకల్యం నిర్ధారణ పరీక్షలు ఏపీ ప్రభుత్వం చేపడుతోంది .రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పరీక్షలు చేయించుకోవాలని చెప్పగా ఇందులో 50 వేల మంది కూడా హాజరు కాలేదట.. అయితే మిగిలిన వారిలో 3 లక్షల మందికి వైకల్యాలు ఉన్నట్లుగా అధికారులు తెలియజేశారు.మిగిలిన వ 60000 మందిలో 40 వేల మంది వైకల్యం ఉన్న కోలుకొనే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే తిరుపతి, విజయనగరం, అనంతపురం, సత్యసాయి జిల్లా, కృష్ణ, శ్రీకాకుళంలో కూడా అక్రమంగా సర్టిఫికెట్లను పొందినట్లు అధికారులు తెలుపుతున్నారు. 15000 రూపాయలు పింఛని అందుకునే వారు 24000 మంది ఉంటే.. ఇందులో 1300 మంది అనర్హులుగా ఉన్నారట. 6000 తీసుకుని పింఛనీలు 7.86 లక్షల మంది ఉండగా కేవలం 4.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వైకల్య సమస్యలు 2 లక్షల మంది ఉండగా ఇందులో లక్ష మందికి పైగా అనర్హులు ఉన్నారని అధికారులు తెలుపుతున్నారు. మరి వీరందరి పరిస్థితి ఏంటన్నది మరి కొద్ది రోజులలో క్లారిటీ ఇవ్వబోతోంది ప్రభుత్వం.