రాష్ట్రంలో తాజాగా ఉగ్రవాదుల అరెస్టు పెను సంచలనం రేపుతుంది .. విజయనగరం పేలుళ్లకు స్థానికుడు సిరాజ్ ప్రణాళిక ఇవ్వడం .. కౌంటర్ ఇంటెలిజెన్స్ అప్రమత్తత వల్ల ఈ కుట్ర బయటకు రావడం తెలిసిందే .. తమిళనాడుకు చెందిన‌ ఇద్దరు ఉగ్రవాదులు దాదాపు 30 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతూ, అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడ‌టంతో పోలీసులు ఒక్కసారిగా హైఅలర్ట్ అయ్యారు .. తమిళనాడు పోలీస్ లు ఇచ్చిన సమాచారంతో ఈ కేసు పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు . అలాగే రాయచోటిలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పేలుళ్ల‌తో దేశంలో అల్లకోలోలం సృష్టించేందుకు కుట్రకు తెర లేపారని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పుకొచ్చారు .


అలాగే సౌత్ ఇండియాలోనే పెద్ద ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఉమ్మా ఐసీస్ ఉగ్రవాద సంస్థ ఆలోచన ప్రకారం ఇది నడుస్తుందని పోలీసులు అంటున్నారు .. అలాగే రాయచోటిలో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులకు సహాయం అందిస్తున్నది ఎవరు ? అలాగే వారికి స్థానికంగా ఎవరైనా అనుచరులు ఉన్నారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు .. అలాగే ఉగ్రవాదుల నుంచి 50 ఐఈడి బాంబుల తయారీకి ఉపయోగించే మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా డీఐజీ చెప్పుకొచ్చారు . అలాగే ఈ కేసును అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ఆయన మీడియాతో అన్నారు .. అలాగే ఉగ్రవాదులు స్థానికంగా కొందరిని తమ టీంలోకి రిక్రూట్ చేసుకుని వారికి శిక్షణ ఇచ్చారని అనుమానాలను తాము నిర్ధారించుకోవాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించారు ..


అలాగే ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లు తెలిపారు .. అలాగే ఈ కేసు దర్యాప్తులో ఇంటెలిజెన్స్ సంస్థల సహకారం తాము తీసుకుంటున్నామని , అదే విధంగా ఉగ్రవాదుల కుటుంబ సభ్యుల పాత్ర పైన‌ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని డీఐజీ అంటున్నారు .. ప్రధానంగా అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు  ప్రెస్ మీట్ లో చెప్పారు .. అలాగే వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది .. అలాగే వారిని కడప కేంద్ర కరాగరానికి తరలించారు .. ఇక ఈ ఉగ్రవాదులు ఇద్దరికీ సాంకేతిక నైపుణ్యం ఉందని కూడా అంటున్నారు. రాయచోటిలో స్థిరపడిన వీరు 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలో పేలుళ్ల‌కు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: