
మొదట మిస్సింగ్ ఘటన నమోదు కావడంతో ఆ తర్వాత పోలీస్ అధికారులు కేసులు చేదించడంతో ఈ కేసులో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వివాహమైన తర్వాత రాజా రఘువంశి, సోనమ్ హనీ మూన్ కు మేఘాలయాలకు వెళ్ళగా మే 23న ఈ జంట కనిపించకుండా పోయారు. జూన్ 2న రాజా మృతదేహం లభించగా.. సోనమ్ ఆచూకీ మాత్రం అసలు దొరకలేదు దీంతో పోలీసులు విచారణలో సోనమ్ హత్య చేయించారనే విషయం బయటపడింది.
అయితే వివాహానికి ముందే సోనమ్ , రాజ్ కుస్వాహాను ప్రేమించిందని అయితే వీరి పెళ్లి ఇంటిలో కూడా ఒప్పుకోకపోవడంతో సోనమ్ ఒక ప్లాను వేసి తన భర్తను చంపి ప్రియుడు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుందట.. అలా తన బాయ్ ఫ్రెండ్ రాజ్ తో కలిసి తన భర్తను హత్య చేయించి మొదట మిస్సింగ్ కేసు అన్నట్లుగా సృష్టించాలని చూసిన చివరికి దొరికిపోయింది.సోనమ్ బ్యాగులో రెండు మంగళ సూత్రాలు లభించడంతో రాజా కంటే ముందుగానే సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో వివాహం అయ్యిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అయితే ఈ విషయంపై రాజా రఘువంశి సోదరుడు తన సోదరుడిని చంపిన తర్వాతే వారు వివాహం చేసుకొని ఉండొచ్చేమో అన్నట్లుగా తెలుపుతున్నారు. సోనమ్ కుటుంబమంతా కలిసి తమని మోసం చేసిందనే విధంగా విపిన్ ఆరోపించారు.