తెలంగాణ బిజెపిలో రాజాసింగ్ తో అలజడి మొదలైంది.. తెలంగాణలో బిజెపి పార్టీ అంటేనే  రాజాసింగ్ ద్వారా తెలిసిందని చెప్పవచ్చు. అలాంటి రాజాసింగ్ బిజెపి అనే పదం ఇక్కడి ప్రజలకు తెలియక ముందు, 2018లోనే ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిందుత్వ వాదాన్ని నరనరానా ఎక్కించుకున్న ఏకైక వ్యక్తి రాజాసింగ్.. అలాంటి ఈయన బిజెపిలోనే ఉంటూ ఆ నాయకులపైన విమర్శలు చేసేవారు.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడంతో రాజాసింగ్ కు ఆదరణ కరువైంది.. అంతే కాదు ఈ మధ్య బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేయడంతో పై స్థాయి నాయకులతో ఒత్తిడి ఎదురైంది. దీంతో వెనక్కి తగ్గిన రాజాసింగ్  పూర్తిగా బిజెపి పార్టీకి రాజీనామా చేసేసారు..

అయితే ఆయన రాజీనామా తర్వాత బిజెపి పార్టీ కూడా ఆయనను భుజ్జగించే ప్రయత్నాలు అయితే చేయలేదు.. దీంతో రాజాసింగ్ మరో పార్టీలోకి వెళ్ళబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాంటి ఈ తరుణంలో  రాజాసింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జనసేన కూడా తెలంగాణలో ఒక మంచి లీడర్ కోసం ఎప్పటి నుంచో చూస్తోంది. దీంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా రాజాసింగ్ కూడా ఉండడంతో ఆయనను  పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నారట..దీనివల్ల రాబోవు గ్రేటర్ ఎన్నికల్లో కూడా టిడిపి, జనసేన కూటమికి ఎంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు.

ఈ విధంగా తెలంగాణలో ఎలాగైనా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ వేశారు..ఒకవేళ రాజా సింగ్ జనసేన పార్టీలో చేరితే మాత్రం  తప్పకుండా హైదరాబాదులో వారికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. రాజాసింగ్  పార్టీ బేస్ లో కాకుండా తన సొంత ఇమేజ్ తో ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు. ఈ విధంగా ఎంతో సత్తా ఉన్న రాజాసింగ్  తెలంగాణలో జనసేన పార్టీలో చేరితే మాత్రం తప్పకుండా ఇక్కడ మరో  పార్టీ బలంగా పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: