గత కొన్ని నెలలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి విభేదాలు  ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. వీటిని కొంతమంది నేతలు రాజకీయంగా కూడా  వీటిని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, చెల్లెలు షర్మిల మధ్య విభేదాలు తలెత్తాయి. అది కూడా ఆస్తి విషయంలో అన్నట్లుగా వినిపించాయి. ఈ ఆస్తులు విషయంపై తాజాగా షర్మిల, జగన్ ఉదంతంలో ఏం తేలబోతోంది. మధ్యవర్తిత్వ కోర్టు ఏం చెప్పబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా ఉన్నది. వాస్తవంగా నేరుగా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు సివిల్ కోర్టులో నడుస్తున్నాయి. అవి కాకుండా ఆ తర్వాత ఇంకా ఉంటే కనుక సివిల్ కోర్టులో.. అక్కడ ఫెయిల్ అయితే ఆ తర్వాత హైకోర్టులోకి..ఆ తర్వాత సుప్రీంకోర్టు దాక వెళ్తారు. అలాకాకుండా జగన్ తన చెల్లికి రాసిచ్చిన ఆస్తికి సంబంధించి MOU నే తప్పించి.. మరొకటి కాదు అన్నటువంటి పాయింట్ తో చెబుతూ తను తల్లికి రాసి ఇచ్చినటువంటి ఆస్తిని చెల్లి మార్చేసుకుంది అంటూ తెలిపారు జగన్.



అయితే అలా మార్చేసుకోవడానికి వీలు లేదంటూ మధ్యవర్తిత్వ కోర్టుకు వెళ్లినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తానిచ్చిన మొత్తం ఏదైతే వీలునామ కాదు ఒప్పందమే ( ఎంఓయు).. వాస్తవంగా వ్యక్తుల మధ్య ఎంవోయూలు ఆస్తుల విషయంలో ఫస్ట్ టైం ఈ కేసులో ఉండడం జరిగింది. ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రకటిస్తూ.. తన చెల్లికి తాను ఇంతకుముందు రాసిచేసినటువంటి ఆస్తి ఇవ్వబోనని అంటూ చెబుతూ ఏదైతే మధ్యవర్తిత్వ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఉందో దానిమీద వాదోపవాదనాలన్ని పూర్తి అయ్యాయి.


అటు జగన్ తరుపున ఇటు విజయమ్మ తరపున షర్మిల తరఫున వాదోపవాదనలు పూర్తి  అయ్యాయి. అయితే ఇప్పుడు దాని మీద తీర్పుని రిజర్వ్ చేసింది బెంచ్.. త్వరలోనే తీర్పు వెలుపడే అవకాశం ఉన్నది. మరి అది షర్మిల కు  ఫేవర్ గా ఉంటుందో జగన్ కు ఫేవర్ గా ఉంటుందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: