
దీంతో 18 వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న సుబ్బయ్య నిరాశతో అక్కడి నుంచి బయటికి వచ్చేసారు.. తన ఆస్తిని అంతా కూడా అమ్ముకొని టిడిపి కోసం పనిచేస్తే తనకు అన్యాయం చేశారంటూ సుబ్బయ్య చాలా ఆవేదనతో మాట్లాడారు. దీంతో టీడీపీ పార్టీ కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఉల్లిపాయల సుబ్బయ్య మరణించారంటూ ప్రకటించండి అంటూ తెలియజేశారు. చీరాల మున్సిపాలిటీలో సుమారుగా 33 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో వైసిపి పార్టీ నుంచి ముందు తానే బయటికి వచ్చి చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి చేరానని వెల్లడించారు.
అలాంటి తనని ఈ రోజున నిలువునా మోసం చేశారని చీరాల మున్సిపాలిటీలో ఉండేటువంటి ఆర్యవైశ్యులు 16 వేల ఓట్లు 83% వరకు వేయించి మరి టిడిపి ఎమ్మెల్యేను గెలిపించాను అయినా మోసం చేశారంటూ తెలిపారు. వైసిపి పార్టీలో ఉన్న సమయంలో తనని రెండుసార్లు మోసం చేశారు. ఇప్పుడు టిడిపిలో మూడోసారి కూడా మోసం చేశారంటు మాట్లాడారు. తనకు 14 ఆస్తులు ఉంటే అందులో 12 అమ్మేసి మరి రాజకీయాలు చేశాను ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవిస్తున్నానని వెల్లడిస్తూ టిడిపి కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేశారు.
వైసిపి పార్టీ నుంచి..బయటికి వచ్చేటప్పుడు వైసిపి ఎంపీ వైవి.సుబ్బారెడ్డి కి కూడా చెప్పి బయటికి వచ్చాను.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనకు చాలా ద్రోహం చేశారని ఇప్పుడు కూడా మరొకసారి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు ఉల్లిపాయల సుబ్బయ్య.