ఈ మధ్య కాలంలో వైసీపీకి వరుస షాకులు తగిలేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ సైతం రాబోయే రోజుల్లో అరెస్ట్ కావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో జగన్ బిగ్ బాస్ అంటూ ఈరోజు కూటమి అనుకూల పత్రికలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేత వీరయ్య చౌదరిపై రౌడీ షీట్ నమోదు కావడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇప్పటికే ఇతర వైసీపీ నేతలు ఇబ్బంది పడిన  విధంగా ఈయన కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని  కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  రేషన్ బియ్యం వ్యాపారి హత్య, కౌలు రైతు ఆత్మహత్య కేసులో పొన్నూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారి  అంజి బర్నపును హత్య చేయించింది నిడదవోలుకు చెందిన  నన్నపనేని వీరయ్య చౌదరి అని  పొన్నూరు అర్బన్ సీఐ ప్రకటించారు.

వీరయ్య చౌదరిని అర్బన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేలిముద్రలు సైతం తీసుకున్నారని సమాచారం అందుతోంది.  రేషన్ బియ్యం వ్యాపారులతో వైసీపీ నేతలకు ఆర్థికపరమైన విబేధాలు తలెత్తిన నేపథ్యంలో  గతంలో తమపై ఒత్తిడి  వచ్చిన నేపథ్యంలో ఈ నేతను అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు.  గతంలో వీరయ్య చౌదరి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు  బెయిల్ ను పొందారు.

కౌలు రైతు తన్నీరు శ్రీనివాసరావు  సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో వీరయ్య చౌదరి   శ్రీనివాసరావు ట్రాక్టర్ ను తీసుకెళ్లారు. తన పరువు పోయిందని  భావించి  తన్నీరు శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.  వీరయ్య చౌదరిపై రెండు కేసులు నమోదు కావడంతో  పోలీసులు ఆయనపై రౌడీ షీట్ ను నమోదు చేయడం  ప్రస్తుతం సోషల్ మీడియా  వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం  హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: