
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి హెచ్చరించారు బాలకృష్ణ.. తన పేరు మీద బంగారు బాలయ్య- బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి చేస్తున్నారని.. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా తన పేరును ఉపయోగిస్తున్నారంటూ బాలయ్య తెలియజేశారు. విరాళాల సేకరణ కోసమే ఇలాంటి ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిసిందని తెలిపారు.
అయితే ఈవెంట్ కి ఎలాంటి అనుమతి లేదని ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు నుంచి కూడా ఎక్కడ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటన చేయలేదని ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని.. ఇలాంటి అనధికారికంగా ఈవెంట్ల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. ఎలాంటి ఈవెంట్లు అయినా సరే అన్ని కూడా ధ్రువీకరించి పారదర్శకంగానే నిర్వహించడం జరుగుతుంది. అందుకే ఇలాంటి మోసపూరిత ప్రకటనలు కార్యక్రమాలను ఎవరు నమ్మవద్దంటూ బాలయ్య ఆటు అభిమానులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాలయ్య సినిమాలకు విషయానికి వస్తే.. అఖండ 2 సినిమా షూటింగ్ ఏపీలోని పలు ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు.