
మొత్తం 6,100 పోస్టులకు 5.3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..4.59 లక్షల మంది పరీక్షలు రాయగా ఫైనల్ గా 33,921 మంది అర్హత సాధించారని తెలిపారు. ఇక సెలక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు పెడతామని 9 నెలల్లోనే వీరికి పోస్టింగ్ కూడా ఇస్తామంటూ తెలియజేశారు. విశాఖపట్నం కి చెందిన గండి నానాజీ మొదటి స్థానంలో ఉండగా విజయనగరానికి చెందిన రమ్య మాధురి అనే అమ్మాయి రెండవ స్థానంలో ఉన్నదంట తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాలను ఆన్లైన్లో..WWW.SLPRB.AP.GOV.IN వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లుగా తెలియజేశారు. మొత్తానికి కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే వెలువడింది. అయితే న్యాయవివాదాల కారణంగా కానిస్టేబుల్ ఫలితాలు కొంతమేరకు ఆలస్యంగా విడుదల చేశారు. గడిచిన రెండు వారాల క్రితమే అభ్యర్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను కూడా విడుదల చేశామని ఏపీ ప్రభుత్వం తెలుపుతోంది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించుకొని పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. జులై 29వ తేదీన ఫలితాలు రావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది. ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది. త్వరలోనే మరిన్ని కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామంటు తెలుపుతున్నారు.