
ఇక ఇదంతా పవన్‌ను చీల్చే ప్రయత్నమా లేక నిజంగా పాలనా తీరులో లోపమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. భూ సేకరణ – పవన్ స్టాండ్ స్పష్టమా? .. అమరావతిలో రెండో విడత భూ సేకరణకు పవన్ బహిరంగంగా వ్యతిరేకత ప్రకటించిన తీరు ఆయనలోని ప్రజా దృష్టిని, స్వతంత్ర మానసికతను ప్రతిబింబిస్తుంది. మంత్రివర్గంలోనే అభ్యంతరం చెప్పడం, రైతుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిలదీయడం అనేది పవన్ రాజకీయం డిఫరెంట్‌గా ఉందని నిరూపిస్తోంది. ఈ స్టాండ్ వల్లే భూ సేకరణ అర్ధాంతరంగా ఆగిందన్న ప్రచారం కూడా జనసేన వర్గాల్లో ఊపందుకుంది. ఆర్టీసీ స్థలంపై అసంతృప్తి? .. విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు లీజుకు ఇవ్వడంపై పవన్ కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కంపెనీకి 99 ఏళ్ల లీజుకు అప్పగించడంపై పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తే, అది పెద్ద దుమారానికే దారి తీయనుంది. చట్ట సవరణలపై నో చెప్పిన పవన్ .. తాజాగా నాలా చట్ట సవరణపై పవన్ వ్యతిరేకత కూడా ఇద్దరి మధ్య పాలనా తీరుపై ముక్తాయింపు లేదన్న భావనకు బలం ఇస్తోంది. ఇది కేవలం వాదోపవాదమా? లేక పొత్తు రాజకీయాల్లో కదులుతున్న అంతర్గత అలజడి సూచకమా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి.. పవన్ ప్రభుత్వంలో ఉన్నా, తన వైఖరితో కొన్నిసార్లు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇక ముందే కూటామి ప్రయాణం ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ కలుగజేస్తోంది! అయితే ఈ వార్తలు వైసిపి కావాలనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది అన్న భావన కూడా ఉంది .. అలాగే ఎప్పటికప్పుడు పవన్ టిడిపి , జనసేన బంధంపై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు .. ఇక మరి ఇప్పుడు ఈ వార్తలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి .