ఎమ్మెల్యే రాజాసింగ్ హిందుత్వ వాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన విద్యార్థి దశ నుంచే పోరాటాలకు సిద్ధమై ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాడు.. అలాంటి రాజా సింగ్ ను  ఎన్కౌంటర్ చేసి చంపేయాలని చూసారట. మరి ఆయనను చంపాలని చూసింది ఎవరు? ఈ ప్లాన్ ఎలా జరిగింది వివరాలు చూద్దాం.. రాష్ట్రంలోని యువతను హిందూవాహినిలో చేర్పించి ధర్మం వైపు వెళ్లేలా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు రాజా సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ తరచూ అరెస్టు అయ్యేవాడు. ముఖ్యంగా ఆయన ఎక్కడికి వెళ్లి కార్యక్రమాలు చేయబోతున్నా అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారు.

 ఇలా రాష్ట్రంలో, దేశంలో హిందువులను ఎవరినైనా మతం మారాలని ప్రయత్నాలు చేస్తే వారి దగ్గరికి వెళ్లి మరీ అడ్డుకునేవాడు. అలా ప్రతిరోజు ఏదో ఒక గొడవ సృష్టించడంలో  రాజాసింగ్ ముందుండేవాడు. ఇలా హిందువులను ముస్లింలను వేరుచేసి  మతానికి సంబంధించిన కల్లోలం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఓ కన్నేసింది.. అంతేకాదు ఆయనను ఏదో ఒకటి చేసి ఆపేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎన్నిసార్లు జైల్లో పెట్టించినా ఆయన మళ్లీ రిలీజ్ అయి బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం మాత్రం ఆపేవారు కాదు.. చివరికి విసుగు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు రాజా సింగ్ ను ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేశారట.. ఈ పనిని ఒక పోలీస్ ఆఫీసర్ కు అప్పజెప్పారు.

అయితే రాజా సింగ్ ను  అరెస్టు చేసిన పోలీసు ఆఫీసర్ కూడా హిందూ వాది. అయితే రాజా సింగ్ ను మరియు ఇంకో హిందుత్వవాదిని జీపులో ఎక్కించుకొని ఒక అడవిలోకి తీసుకెళ్లారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కు అప్పటివరకు రాజా సింగ్ ఏం చేస్తున్నారన్నదే మాత్రం తెలియదు.. వాళ్ల పై  అధికారులు, రాజకీయ, నాయకులు ఆయనను ఎన్కౌంటర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారమే అడవిలోకి తీసుకెళ్లి రాజాసింగ్ ను పరిగెత్తమని చెప్పారు.. తన గన్ లోడ్ చేస్తున్న సమయంలో రాజాసింగ్ నేను పరిగెత్తను నన్ను డైరెక్ట్ గా కాల్చండి అంటూ హిందూ స్లొగన్స్ ఇచ్చాడట.. దీంతో ఇదంతా గమనించినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.

ఎందుకు ఇలా కాల్చమని ఆదేశాలు పంపారు అనే విషయాన్ని రాజాసింగ్ ని అడిగారు.. చివరికి హిందువుల కోసం కొట్లాడుతున్నాను అనే వివరాలన్నీ దాదాపు రెండు గంటలకు పైగా పోలీస్ ఆఫీసర్ కు చెప్పడంతో, ఆయన ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా మీడియాకు చెప్పారు.. వెంటనే మీడియాలో రాజాసింగ్ ను ఎన్కౌంటర్ చేయబోతున్నారు ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రచారం చేయడంతో, వెంటనే ఆ నాయకుడు ఫోన్ చేసి ఎన్కౌంటర్ ఆపాలని  చెప్పారట. ఆ విధంగా రాజా సింగ్ ఆనాడు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అప్పట్లో మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: