
హైదరాబాదులో గచ్చిబౌలిలో rrr ఇంటి వద్ద నిఘా కోసం అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఒక కానిస్టేబుల్ ని పంపించిందని ఇందులో ఫరూక్ భాష అనే కానిస్టేబుల్ తిరుగుతూ ఉండేవారని దీంతో ఆయనను పట్టుకొని రఘురామ ఆయన కుమారుడు భరత్ కానిస్టేబుల్ పైన దాడి చేసినట్లుగా గచ్చిబౌలిలో కేసు నమోదు అయ్యింది. వాస్తవానికి తాము అయన పైన దాడి చేయలేదని అప్పట్లో వారు ఆరోపించారు.. కేవలం తమ ఇంటి వద్ద నిఘా ఉంచారని ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా కానిస్టేబుల్ ని కొట్టారనే విషయంపై కేసు నమోదు చేయడంతో తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు రఘురామ.
అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈ వ్యవహారంపై రఘురామ హైకోర్టుని ఆశ్రయించారు. కానీ హైకోర్టు rrr పిటిషన్ తోసిపుచ్చింది.. ఆ తర్వాత వెంటనే రఘురామ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.సుప్రీంకోర్టులో జస్టిస్ జీకే మహేశ్వరి, విజయ్ బీష్ణవ్ బెంచ్ పిటిషన్ విచారణ చేశారు. ఈ సమయంలో ఫిర్యాదు దారుణంగా ఉన్న కానిస్టేబుల్ ఫరూక్ బాషా ఈ కేసు తాను ఇకపై కొనసాగించాలనుకోలేదు అంటూ తెలిపారట.. ఈ విషయంపై సుప్రీంకోర్టు అఫీడవిట్ దాఖలు చేయాలని సూచించింది... అలాగే రఘురామ లాయర్ ను అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాల పైన పూర్తి వివరాలు అందించాలంటూ ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు. మరి తదుపరి విచారణ అనంతరం రఘురామకు ఊరట కలిగించే విషయంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.