
ఈసారి అభ్యర్థులు ఎంపిక విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను దింపే ఆలోచనలో ఉన్నారు. అందుకే నియోజకవర్గంలో బాధ్యతలు ఎవరికి ? అప్పగించాలని విషయంలో జగన్ సీరియస్ గా కసరత్తులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం విషయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబును తప్పించి ఆయనకు గుంటూరు వెస్ట్ బాధ్యతలు అప్పగించారు. సత్తెనపల్లి బాధ్యతలు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డికి అప్పగించారు. ఇక సొంత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. జమ్మలమడుగు వైసిపి బాధ్యతలు మాజీమంత్రి పి రామసుబ్బారెడ్డి కి అధికారికంగా అప్పగించడమే తరువాయి. ఇప్పటికే రామసుబ్బారెడ్డి అక్కడ పనిచేస్తున్నారు.
ఆయనకు బాధ్యతలు ఇస్తే భవిష్యత్తులో అంతా బాగుంటుంది అని జగన్కు నివేదికలు వెళ్లాయి. కష్ట సమయంలో రామ సుబ్బారెడ్డి మాత్రమే పార్టీ కార్యకర్తలు నాయకులకు అండగా ఉంటున్నారని నివేదికలు వెళ్లాయి. మరీ ముఖ్యంగా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఓడించాలని పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే అందర్నీ కలుపుకు వెళ్లే స్వభావంతో పాటు పెద్దమనిషి అనే గౌరవం ప్రజల్లో ఉన్న రామసుబ్బారెడ్డికి ఇన్చార్జి పగ్గాలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఈసారి జమ్మలమడుగు వైసిపి అభ్యర్థి మారటం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు. ఇక సొంత జిల్లా కావడంతో జగన్ ప్రతి నియోజకవర్గంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు