ఎస్ ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ లో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . వైయస్ జగన్ .. ఓ మాజీ ముఖ్యమంత్రి .. పొలిటికల్ చరిత్రలో ఆయన పేరు మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు . వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన ఆ తర్వాత వైఎస్ జగన్ గా మారి ఆయన అంటే ఏంటి..? ఆయన పొలిటికల్ స్ట్రాటజీలు ఏంటి..? అనేటివి బాగా అధికారంలో ఉన్నప్పుడు చూపించారు . అప్పట్లో వైయస్ జగన్ ఏ డెసిషన్ తీసుకున్న సరే అది పర్ఫెక్ట్ అంటూ పొగిడే జనాలు ఎక్కువగా కనిపించారు . కేవలం వైసీపీ నేతలే కాదు చాలామంది కామన్ పీపుల్స్ కూడా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను అప్రిషియేట్ చేశారు . అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకున్న డెసిషన్స్ మనల్ని పాతాళానికి పడిపోయేలా చేస్తుంది. అలానే వైయస్ జగన్ తీసుకున్న ఒక నిర్ణయం ఆయనకు ఊహించని తలనొప్పులు తీసుకొచ్చింది.  ఆ తలనొప్పి పేరే "నీలం సాహ్నీ".

ఎక్కడో ఉన్న ఆమెను వైసిపి హయాంలో రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం హోదాలో ఉన్న జగన్ నియమించారు . అప్పట్లో ఈ విషయం సెన్సేషన్ గా మారింది . అంతేకాదు 2020 జూన్ లో పదవి విరమణ చేయగా కరోనా సమయంలో ఆమె సేవలు రాష్ట్రానికి చాలా అవసరం అంటూ మూడు నెలలు కొనసాగించాలి అంటూ కేంద్రానికి జగన్ ప్రభుత్వం లేఖ రాసి ఆమె కాలం పెంచారు జగన్. ఆమెను ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు . అప్పట్లో జగన్ నీలం సాహ్నీ  పేర్లు మారుమ్రోగిపోయాయి . అంతేకాదు ఎస్ ఈ సి గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాల్సి వచ్చింది .

అయితే జగన్ సిఫారస్సు మేరకు 2021 మార్చిలో నీల సాహ్నీ నాటి గవర్నర్ నియమించిన సంగతి తెలిసిందే. అప్పుడు జగన్ ప్రభుత్వం సిఫారసు మేరకు నియమితులైన నీలం సాహ్నీ నేటికీ ఎస్ఈసీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం గమనార్హం . అయితే వైసిపికి రైట్ హ్యాండ్ గా ఉంటుంది .. వైసీపీకి చేదోడు వాదోడుగా ఉంటుంది అని జగన్ భావించారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కానీ నీలం సహ్నీ మాత్రం వైసీపీకి బిగ్ హ్యాండ్ ఇచ్చింది అంటూ టాక్ వినిపిస్తుంది .

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని  అరాచకాలకు పాల్పడుతుంది అంటూ ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది జనాలు, వైసిపి నేతలు నెత్తి నోరు కొట్టుకుంటూ వేడుకున్నారు. చర్యలు తీసుకోవాలి అంటూ పదే పదే గుర్తు చేశారు . కానీ ఆమె మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు ప్రేక్షక పాత్ర పోషించింది అన్న విమర్శలు కూడా వినిపించాయి . ఎలాంటి అధికారికి కీలక బాధ్యతలు అప్పగించాలో జగన్ కి తెలియదా..? ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ తమ నాయకుడిని సొంత వైసిపి నేతలు తప్పు పడుతూ ఉండడం గమనరాహం.

ఎస్ఈసి నీలం సాహ్నీ ఎందుకు టిడిపి పై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్.  కీలక వ్యవస్థలో ఎలాంటి వారిని కూర్చో పెట్టాలో వైఎస్ జగన్ కి ఇది ఒక పెద్ద గుణపాఠంగా మారింది అంటున్నారు వైసిపి నేతలు . నీలం సాహ్ని ని  తనకు తానే రైట్ హ్యాండ్ గా జగన్ భావించుకున్నాడు . ఇప్పుడు ఆమె ఆ రైట్ హ్యాండ్ ని దేనికి పనికి రాకుండా చేసేసింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . జగన్ కి ఇది కోలుకోలేని షాక్ అంటూ పర్సనల్గా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!
 


మరింత సమాచారం తెలుసుకోండి: