
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం కడప, పులివెందుల ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె కామెంట్లు చేశారు. గతంలో మోడీ సర్కార్ ఇచ్చిన 1500 కోట్ల రూపాయలను జగన్ దారి మళ్లించారని ఆమె అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పారని అయితే స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని శబరీ వెల్లడించారు. వైసీపీ పాలనలో ఏం జరిగినా ఆ నెపం టీడీపీపై నెట్టారని ఆమె తెలిపారు.
వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో దోచుకోవడం మినహా ఏం జరగలేదని చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ దృష్టికి వైసీపీ కుట్రలను తీసుకెళ్లి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో లతారెడ్డిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. శబరి ధీమా నేపథ్యంలో పులివెందుల ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
పులివెందుల zptc ఎన్నికలను వైసీపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. జగన్ సొంత నియోజకవర్గంలో సత్తా చాటాలని గతంలో కూడా టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వేంపల్లి మండలంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు