ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ సెలబ్రిటీల వేధింపుల విషయంపై ఎక్కడో ఒకచోట ఏదో ఒక వార్త వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా కేరళ ప్రాంతానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు తనని వేధిస్తున్నారు అంటూ మలయాళ నటి రిని ఆన్ జార్జ్ పలు రకాల సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనకు చాలా అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడమే కాకుండా హోటల్ కి రావాలి అంటూ వేధిస్తున్నారని ఆరోపణలు చేసింది. గడచిన మూడేళ్లుగా అతని నుంచి తనకి ఈ వేధింపులు వస్తున్నాయని నటి వెల్లడించింది.


కానీ తన పైన ఎలాంటి దాడి జరగలేదని కానీ రాజకీయ నాయకుడి వల్ల అనేకమంది వేధింపులకు గురయ్యారంటు వెల్లడించింది. తాను వారి తరుపున కూడా మాట్లాడుతున్నానని తెలియజేసింది నటీ రిని. ఇమే చేసిన ఈ ఆరోపణలు కేరళ రాజకీయాలలో ఒక సంచలనంగా మారుతున్నది. ఆ రాజకీయ నాయకుడి పేరు చెప్పనప్పటికీ కూడా కొంతమంది బిజెపి కార్యకర్తలు మాత్రం పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్ అంటూ ఆరోపణలు చేస్తూ పలు రకాల నిరసనలు కూడా చేస్తున్నారు. ఈ విషయం పెద్దదిగా మారింది.



ఈ విషయం మలయాళ సినీ ఇండస్ట్రీలో,  కేరళ  రాజకీయాలలో సంచలనంగా మారడంతో రాహుల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే నటి రిని ఆన్ జార్జ్ మాత్రం ఈ విషయం పైన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. ఈ వేధింపులు మాత్రం ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఆ నాయకుడు పేరు బయటకు పెడతాను అంటూ తెలియజేయడం జరిగింది. రిని ఆన్ జార్జ్ మలయాళం నటి అయినప్పటికీ కూడా ఈమె గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేసింది. 916 కుంజుట్టాన్ అనే మలయాళ సినిమాలో నటించింది ఇమే. మరి ఈ విషయం పైన అటు రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతమైతే ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: