
ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టిడిపి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని A2 పెట్టి, జనసేన నేత అశోక్ రౌత్ ను A1 గా పెట్టారు. ఈ వ్యవహారం అంతా కూడా టిడిపి ఎమ్మెల్యే తప్పించేందుకే ఇలా చేశారని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నారు. అలాగే వీరిద్దరి పైన బెయిలబుల్ కేసులో పెట్టడం మరింత విశేషమని చెప్పవచ్చు. శ్రీశైలం అడవులలో అర్ధరాత్రి సమయంలో తమను బంధించి కొట్టడంపై అటవీశాఖ అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి మరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం పైన అటు మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారంపై వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిసి ఫుటేజ్ లలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి దాడి దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయని అలాంటి ఆయనను A2 గా పెట్టడమేంటి అటు జనసేననేతను A1 గా పెట్టడం ఏంటని చర్చ కూడా ఇప్పుడు శ్రీశైలం రాజకీయాలలో మొదలయ్యింది. అయితే ముఖ్యంగా వీరిద్దరి పైన కూడా బెయిల్ లభించేలా కేసు పెట్టడం పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వీరి పైన మౌనంగానే ఉన్నది.