ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా భయంకరంగా ఉంటాయి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారిని చిత్రహింసలకు గురి చేయడం మామూలుగా మారిపోయింది. వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంటే టిడిపి పార్టీ నేతలని, టిడిపి పార్టీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ నేతలను చిత్రహింసలు పెట్టడం ఏపీ రాజకీయాల్లో కామన్ గానే ఉంటుంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఓ బడా రాజకీయ నాయకుడి హత్యకి కొంతమంది రౌడీషీటర్లు స్కెచ్ వేశారు.దానికి సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది.మరి ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే టిడిపి పార్టీ నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వింటుంటే షాకింగ్ గా అనిపించినప్పటికీ ఇదే నిజం.

ఎందుకంటే కొంతమంది రౌడీలు గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడానికి ఆ రౌడీలు మద్యం తాగుతూ చర్చించుకున్నారు. అయితే ఈ రౌడీలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు అని తెలుస్తోంది. రౌడీ శీటర్ శ్రీకాంత్ తన ముఖ్య అనుచరుడు అయినటువంటి జగదీష్ తో ఈ హత్య ప్లాన్ రచించినట్టు తెలుస్తోంది. ఇక వైరల్ అవుతున్న వీడియోలో రౌడీలు జగదీష్, మహేష్,వినీత్ లు ఉన్నారు. వీళ్లంతా మద్యం సేవిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటున్నారు. మద్యం తాగి తీసుకున్న ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు.

అయితే ఈ విషయం గురించి ఇప్పటికే టిడిపి శ్రేణులు పోలీసులకి సమాచారం అందించినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని టిడిపి వాళ్ళు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియో పై విచారణ జరుపుతున్నాం అంటూ ఎస్పి కృష్ణకాంత్ తెలిపారు. అలాగే ఈ హత్య కుట్ర వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని త్వరలోనే బయట పెడతామంటూ చెబుతున్నారు.. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై చేసిన హత్యకుట్రకి సంబంధించిన వీడియో మెయిన్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గా రౌడీ షీటర్ శ్రీకాంత్ కి సంబంధించిన ఎన్నో విషయాలు బయటికి వస్తున్న తరుణంలో తాజాగా ఆయన రచించిన హత్య ప్లాన్ మరొకటి కూడా బయటపడడంతో ఇది కాస్త సంచలనం సృష్టిస్తోంది. ఇక వైసిపి వాళ్ళే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి ప్లాన్ వేశారు అని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: