ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భారీ చర్చ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఈసారి కూటమి ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారబోతోందని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా – ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, దోపిడీలు ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. abn ఆర్కే ఇటీవల రాసిన “ఎమ్మెల్యేలు కలెక్షన్లకు రాజులు” అనే కథనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆయన ప్రకారం – సుమారు 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోపానికి గురై , ఎప్పుడైనా జరిగే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం.


 ఇది చంద్రబాబు , పవన్ విఫలత వల్ల కాదని, ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తనే కారణమని ఆర్కే స్పష్టం చేశారు. ప్రజల మాటల్లో – ఈ ఎమ్మెల్యేలు చికెన్ బిజినెస్, కంకర, ఇసుక, మద్యం దందాలు అన్నీ నేరుగా కంట్రోల్ చేస్తూ దోచేస్తున్నారట. కాంట్రాక్టర్లతో కలసి కమీషన్లు వసూలు చేస్తూ … పేద ప్రజలకు సహాయం చేయడం మర్చిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపు వారి వ్యక్తిగత కీర్తితో కాదని, పొత్తు బలంతో వచ్చిన ఓట్లు కారణమని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని ఆర్కే చెబుతున్నారు. ఇప్పుడు అదే ప్రజల తీర్పు వారికి ఎదురు తిరుగుతోంది.

 

మరింత సీరియస్‌గా – ఆర్కే అభిప్రాయం ప్రకారం , రాజకీయ అవినీతి ఇప్పటి రాష్ట్రంలో స్వాతంత్ర్యం తర్వాత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రజల్లో ఉన్న అసహనం పెద్ద ఎత్తున కూటమిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదని, “40 - 50 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే ఏముంది ? మాకింకా మెజారిటీ ఉంటుంది” అన్నట్టుగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆర్కే హెచ్చరిక స్పష్టమే – ఎమ్మెల్యేలు మారకపోతే, ప్రజల తీర్పు వారిని నేల మట్టం చేస్తుంది. ఈసారైనా నేతలు మేల్కొని ప్రజల గుండెల్లో నిలబడేలా మారకపోతే, రాబోయే ఎన్నికల్లో కూటమి శక్తి కుదేలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: