
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే వాటిని డబ్బుల సమీకరణ అని రాసేటువంటి దుస్థితి కనిపిస్తోంది కూటమి అనుకూల మీడియా . కాని "వైసిపి అనుకూల పత్రికలో అప్పుల్లో సీఎం చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నెలనెల భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టించడంలో తిరోగమనంలో వెళుతోందని.. హామీలను పట్టించుకోకుండా బడ్జెట్ లోపల బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్ల దూసుకుపోతున్నారంటూ రాసుకుంది. నిన్నటి రోజున రూ .5000 కోట్ల రూపాయలు అప్పు చేశారని.. దీంతో ఏకంగా ఇప్పుడు రూ.2,09,085 కోట్లకు ఏపీ అప్పులు చేరాయి అంటూ తెలిపారు. కేవలం 15 నెలల పాలనలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయలేదంటూ రాసుకొచ్చారు వైసిపి అనుకూల మీడియా".అప్పుడు జగన్ చేసిన అప్పులను కూడా కప్పిపుచ్చుకుంది వైసిపి అనుకూల మీడియా.
ఇక మరొకవైపు కూటమి అనుకూల మీడియా విషయానికి వస్తే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రోజున రూ .5000 కోట్ల రూపాయలు సమీకరించిందంటూ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించినటువంటి సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఆ మొత్తం స్వీకరించిందంటూ రాసుకుంది.. అయితే అప్పులు తీసుకున్న దాన్ని సమీకరణం అంటూ రాసుకు రావడం చర్చనీయాంశంగా మారింది.. జగన్ పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారని రాసిన మీడియానే ఇప్పుడేమో అప్పులు చేస్తే రాష్ట్రానికి నిధులు సమీకరిస్తున్నట్లుగా రాసుకు వచ్చారు. ఇలా అధికారం ఎవరిదైతే వారి అనుకూల పత్రికలు, మీడియాలు కూడా వారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుతూ నిధులను సమీకరించడం అభివృద్ధి అంటూ హైలెట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలే నష్టపోయేలా కనిపిస్తోంది. ఈ అప్పులను కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల పైనే ఈ భారం పడబోతుందని నిపుణులు సైతం తెలుపుతున్నారు.