- వాటిని కప్పిపుచ్చుకోడానికి అబద్ధాలతో సభ..
- సూపర్ సిక్స్ అన్నీ అమలు చేశామని కూటమి నేతలు ప్రమాణం చేయగలరా..?
- కూటమి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరు
- జగన్ చేసిన తప్పులను పునరావృత్తం చేస్తున్న కూటమి
- బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మండిపాటు..

కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 15 అతిపెద్ద వైఫల్యాలు ఉన్నాయని.. వాటిని కప్పిపుచ్చుకోడానికి.. "సూపర్ సిక్స్ - సూపర్ హిట్" అంటూ అబద్ధపు సభ నిర్వహించారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దుయ్యబట్టారు.. అనంతపురంలో కూటమి నిర్వహించిన సభపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.. ఈ 15 నెలల కూటమి పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ పెనంపై పెడితే, ఈ కూటమి పెనం నుండి పొయ్యిలే పడేసిందని విమర్శించారు.. ఈ సభ "అబద్ధాలతో కూడిన సెన్ఫ్ డబ్బా సభ" అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇవే ఆ 15 వైఫల్యాలు..!
* నిరుద్యోగం తీవ్రం: జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఈ లెక్కన ఈ 15 నెలల్లో కనీసం 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది, కానీ కనీసం 50 వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదు..
* వ్యవసాయం సంక్షోభం: వ్యవసాయం చేసే ఏ రైతు సంతోషముగా లేరు.. గడిచిన 15 నెలల్లో అనేక పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.. మామిడి, కోకో, ఉల్లి, టమాటా రైతులు రోడ్డెక్కిన సంగతి మార్చిపోయారా..? రైతుల కన్నీటికి కారణమైన ఈ కూటమి ఏ విధంగా హిట్ అయినట్టు..?
* బీసీ రక్షణ చట్టం: కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు.. లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర సహా, ఎన్నికల ప్రచార సభల్లో కూడా హామీలిచ్చారు.. కానీ ఈ 15 నెలల కాలంలో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు.. బీసీలపై దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
* మహిళలకు రక్షణ, సాయం: మహిళలకు రక్షణ లేదు.. కూటమి 15 నెలల పాలనలో 150 మందికి పైగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి.. కర్నూలు జిల్లా మచ్చుమర్రి మొదలుకుని.. ఎన్నో ఘటనల్లో ఇంకా బాధితులకు న్యాయం జరగలేదు.. ఆడబిడ్డలకు ఓ వైపు న్యాయం లేదు.. మరోవైపు సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వడం లేదు..


* సూపర్ సిక్స్ సూపర్ మోసం: సూపర్ సిక్స్ అంటే మీరు హామీ ఇచ్చినట్టు ఆరు పథకాలు అమలు చేయాలి.. కానీ మీరు నాలుగు మాత్రమే అమలు చేశారు.. ఆ నాలుగు కూడా అసంపూర్తిగానే చేశారు.. మరి సూపర్ హిట్టు అని ఎలా అంటారు..? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భరోసా ఇవ్వకుండానే సూపర్ హిట్టు అని మీకు మీరు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుని, జనం చెవిలో పూలు పెడతారా..?
* విచ్చలవిడి అప్పులు: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 10 లక్షల కోట్లు అప్పులు చేసారంటూ విస్తృతంగా ప్రచారం చేసిన మీరు.. ఈ 15 నెలల కాలంలో చేసిందేమిటి..? రకరకాల అడ్డదారుల్లో లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేశారు.. ఇది ఘోరమైన వైఫల్యం కాదా..?
* ఒక్క పరిశ్రమ తెచ్చారా..? మీరు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఇదిగో పరిశ్రమలు, అదిగో పరిశ్రమలు లీకులు ఇస్తున్నారు.. ఒప్పందాలు అంటున్నారు.. కానీ ఈ 15 నెలల్లో ఒక్కటి కూడా సరైన పరిశ్రమ రాలేదు, పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి..
* విచ్చలవిడి అవినీతి: గత ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో భారీ అవినీతి కూడా ప్రధాన కారణం.. మీరు కూడా ఈ 15 నెలల కాలంలో అవినీతిని అడుగుపు చేయలేదు.. పైగా విచ్చలవిడిగా మరింత విస్తృతం చేశారు.. కూటమి ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నారు.. వైసీపీ వాళ్ళు చేసిన అవినీతిలో వాటాలు తీసుకుని కాంప్రమైజ్ అయిపోతున్నారని.. మీ కార్యకర్తలే చెప్తున్నారు.. ఇది సిగ్గులేని అతిపెద్ద వైఫల్యం కాదా..?


* ఊరూరా విస్తృతంగా మద్యం: గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం మాఫియా నడిచింది, భారీగా అవినీతి అంటూ ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు.. కానీ ఇప్పుడు మీ హయంలో జరుగుతున్నదేమిటి..? ఊరూరా రెండు, మూడు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ ను మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చేస్తున్నారు.. ఎక్కడా ఎమ్మార్పీ ధరలు అమలు కావడం లేదు.. మీ మాఫీయా, సిండికేట్ ద్వారా పేదలను పీక్కు తింటున్నారు..  
* విద్యుత్తు చార్జీలు: గత ప్రభుత్వంలో ఆ ఐదేళ్లలో 13 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారు.. మీరు అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలు అసలు పెంచము.. వీలునుబట్టి తగ్గిస్తాం అని చెప్పారు.. కానీ ఇప్పుడు మీరు గడిచిన 15 నెలల కాలంలో మూడు సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారు.. ఇది వైఫల్యం కాదా..?
 * మెడికల్ కాలేజీలు వ్యాపారం: కేంద్రం ఇచ్చిన నిధులు, అనుమతులతో.. గత ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకువచ్చింది.. వారు సకాలంలో నిర్మాణం పూర్తి చేయలేదు.. ఇప్పుడు మీరు వాటిని ప్రైవేటీకరణ అంటున్నారు.. పీపీపీ విధానం అంటే పేదలకు వైద్య విద్యను దూరం చేయాలడమే.
* షిర్డిసాయికి దాసోహం: గత ప్రభుత్వంలో షిర్డీసాయి అనే కంపెనీకి 92 వేల కోట్ల విలువైన విద్యుత్తు కాంట్రాక్టులు కట్టబెట్టారు.. దేశంలో అని రాష్ట్రాల్లో రూ. 80 వేలు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ని వాళ్ళు 1.50 లక్షలకు కొన్నారు.. దీనిలో సుమారుగా రూ. 30 వేల కోట్ల కుంభకోణం జరిగినట్టు అంచనా.. ఈ స్కాం పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోకుండా.. మళ్లీ వారికే అదే ధరకు కాంట్రాక్టు ఇస్తున్నారు.. ఇది దోపిడీ కాదా, వైఫల్యం కాదా..?


* యువగళం హామీలు మర్చిపోయారా..?: యువగళం అంటూ లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో మొత్తం 32 హామీలిచ్చారు.. వాటిలో ఒకటి మాత్రమే అమలు చేశారు.. మిగిలిన 31 హామీలు అమలు కాలేదు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు, ధరల స్థిరీకరణ, ఉద్యోగాలు, పరిశ్రమలు ఏమయ్యాయి..?
* నీటి ప్రాజెక్టులపై శ్రద్ధ లేదు: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కూటమి ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరి.. ఈ 15 నెలల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. పైగా బనకచర్ల పేరుతో కాలయాపన, డ్రామాలు, షోలు చేస్తూ.. ఉన్న ప్రాజెక్టులను అశ్రద్ధ చేస్తున్నారు..!
 * అమరావతిలో ఏం చేసారు..?: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో మీ రాజకీయ కళ చూపిస్తున్నారు తప్ప.. పనుల్లో పురోగతి లేదు.. ఒక్క ప్రాజెక్టుని సిద్ధం చేయకుండానే మళ్లీ భూ సమీకరణ అంటూ భూ దోపిడీకి తెరతీశారు.. ఇక్కడే కాదు.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భూ కేటాయింపుల్లో కూడా భారీగా అవినీతి దొర్లింది..
ఇలా అడుగడుగునా, అన్ని రకాలుగా, అన్ని వర్గాల్లోనూ విఫలమైన కూటమి.. వందల కోట్ల ప్రజాధనం వృథా చేస్తూ నిర్వహిస్తున్న ఈ సభ పూర్తిగా సెల్ఫ్ డబ్బా సభ.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సభ నిర్వహణపై రాష్ట్ర ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: