అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసా విషయంలో తీసుకున్న నిర్ణయం పైన చాలా దేశాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ రంగం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది అంటూ ఆర్థిక నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి ఐటీరంగం భారీగానే లబ్ది పొందింది. H-1B వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్ల నిర్ధారించడం.. భారత  ఐటీ రంగం పైన ఒక పెద్ద పిడుగు లాంటి వార్త.. అమెరికా వర్క్ వీసా కార్యక్రమాలు, వ్యాపార సేవలు, సాఫ్ట్వేర్, ఔట్సోర్సింగ్ ఇతరత్న రూపంలో భారత్ ఐటి సెంటర్ కింద 283 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. (అంటే అక్షరాల 25 లక్షల కోట్ల రూపాయలు).తాజా పరిణామాలతో వీటి పైన భారీ దెబ్బ పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. 


 భారతదేశ మొత్తం ఐటి రంగంలో 57% పైగా అమెరికా మార్కెట్ నుంచి లబ్ధి పొందుతున్నారంటు నిపుణులు తెలియజేస్తున్నారు. కేవలం గత ఏడాది H-1B వీసా విషయంలో భారత్లో 71% భారతీయులే లబ్ధిదారులుగా ఉన్నారని చెబుతున్నారు. 11.7% మంది మాత్రమే చైనా రెండవ స్థానంలో ఉన్నది. అలాగే మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, వాల్ మార్ట్ వంటి ఐటీ దిగ్గయ్య కంపెనీలపైన ట్రంప్ చాలా ఒత్తిడి పెంచేసారంటూ వినిపిస్తున్నాయి.


అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంతో విదేశీయులను తగ్గించాలనే విధంగా మార్పులు చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయుల కల మళ్లీ చేజారి పోతోందంటు ఐటి అవుట్ సోర్స్ కంపెనీ సీఈవో గణేష్ నటరాజన్ తెలియజేశారు. మెక్సికో, భారత్, ఫిలిప్పిన్స్ వంటి దేశాలకు కూడా ఉద్యోగాల నియమించుకునే విషయంలో పరిమితిని పాటిస్తున్నాయన్నట్లుగా వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో నుంచి H-1B వీసా మీద వెళ్లే వారు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని దేశాలు అమెరికా తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: