దేశవ్యాప్తంగా ఉండే రాజకీయాలన్ని ఒక లెక్క ఉంటే తమిళనాడులో మరో లెక్క ఉంటుంది.. ఇక్కడ ఏ పార్టీ ఎప్పుడు గెలుస్తుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఎక్కువగా సినీ నటుల కు సంబంధించి ఉంటాయి. ఒకప్పుడు స్టార్ నటిగా ఉన్న జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని చాలా ఏళ్ల పాటు పాలించింది. అదే బాటలో ప్రస్తుతం దళపతి విజయ్ వెళ్తున్నారు. తమిళ వెట్రి కళగం అనే పార్టీ స్థాపించిన ఆయన చాలా స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. సభలు సమావేశాలతో జనాల్లో సరికొత్త మార్పు తీసుకొస్తున్నారని చెప్పవచ్చు. రాబోవు ఎన్నికల్లో టీవీకే నుంచి గట్టి పోటీ ఉంటుందని అంతేకాదు అదే పార్టీ గెలవబోతుందని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. ఆ సర్వే ఏంటి ఆ వివరాలు చూద్దాం..


 టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చెప్పిన దాని ప్రకారం  దళపతి విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకి ఏకంగా 125 నుంచి 155 స్థానాలు వస్తాయని తెలియజేసింది. అధికారం చేపట్టడానికి సాధారణంగా 118 సీట్లు చాలు.కానీ టీవీకే పార్టీకి అంతకంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని ఆ సర్వేలో వెల్లడించారు. అధికార డిఎంకె పార్టీకి 25 నుంచి 45 సీట్లు  వస్తాయని చెప్పింది. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి ఏడీఎంకే 13 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటుందని, మిగతా పార్టీలు రెండు నుంచి ఐదు స్థానాలు వస్తాయని సర్వే ద్వారా బయటపడింది.

ఈ విధంగా దళపతి విజయ్ టీవీకే పార్టీ ద్వారా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తారని, అద్భుతమైన మెజారిటీతో అధికారం చేపడతారని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తమిళనాడు రాజకీయాల్లో నటుల ప్రభావం అనేది ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డీఎంకే మరియు బలమైన ప్రతిపక్షం ఎడిఎంకేలు అత్యల్ప స్థానాలకు పరిమితం అవుతాయని సర్వేలో వెల్లడించింది. మరి చూడాలి ఈ సర్వే ప్రకారం టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ముందు ముందు తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: