టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా పోస్ట్‌లు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. పండుగ వేళ ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. "కొత్త ప్రయాణం" అంటూ సమంత షేర్ చేసిన ఫోటో, అభిమానుల్లో, నెటిజన్లలో అనేక చర్చలకు దారి తీసింది.

సమంత తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోను పంచుకుంటూ ఈ ప్రయాణం గురించి వెల్లడించింది. అయితే, ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో ఇంటి గోడపై 'SAM' అనే లోగో స్టైలిష్‌గా డిజైన్ చేయబడి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లోగోను చూసిన ఫ్యాన్స్, ఇది ఆమె కొత్త ప్రయాణానికి చిహ్నంగా భావిస్తున్నారు. ఈ కొత్త ఇల్లు హైదరాబాద్‌లో ఉందా లేక మరేదైనా నగరంలో ఉందా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన సందర్భంగానే ఆమె ఈ పోస్ట్ చేసిందని తెలుస్తోంది.

మరోవైపు, సమంత నటించిన 'అంజాన్' సినిమాకు సంబంధించిన పాత బికినీ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా మళ్లీ వైరల్ అవుతుండటం గమనార్హం. ఒకవైపు కొత్త ప్రయాణం గురించిన వార్తలు, మరోవైపు పాత గ్లామరస్ ఫోటోలు.. మొత్తంగా సమంత మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న సమంత, ఇటీవల తన కొత్త ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆమె నిర్మించిన తొలి చిత్రం 'శుభం' విడుదలై  హిట్ గా నిలిచింది. అలాగే, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్, రెండో పెళ్లి గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె చెప్పిన "కొత్త ప్రయాణం" వ్యక్తిగత జీవితంలో కొత్త ఇంటికి పరిమితమవుతుందా, లేక కెరీర్ పరంగా నిర్మాతగా లేదా మరేదైనా కొత్త పాత్రలో మొదలవుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం సమంత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో, రానున్న రోజుల్లో వాటిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: