తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన కానీ  అసలు ఎన్నికలు అవుతాయా? లేదంటే క్యాన్సిల్ అవుతాయా అనే దానిపై నాయకులు డైలమాలో పడ్డారు.. ఇదే సమయంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ పై ఇప్పటికే పలువురు హైకోర్టు,సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిదో తేదీన హైకోర్టులో ఈరోజు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. మరి దీనిపై కోర్టు తీర్పు ఎలా ఇస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే ఓకే లేదంటే మరో ప్లాన్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రెడీ చేసుకున్నట్టు సమాచారం. అదేంటో ఇప్పుడు చూద్దాం.. 

ఇదే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించడానికి ఒక టీం ఢిల్లీకి వెళ్లింది. 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ ఇంకా గవర్నర్ దగ్గర గెజిట్ కానందున  జీవో చెల్లదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా చెబుతూ వస్తున్నారు. అయితే బిల్లుతో సంబంధం లేకుండా జీవో ఇచ్చామని ప్రభుత్వం వాదించే అవకాశం కనబడుతోంది. ఈ విధంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైనా కానీ రేవంత్ సర్కార్ వెంటనే ప్లాన్ బి అమలు చేయాలనుకుంటుంది. ఒకవేళ కోర్ట్ లో గ్రీన్ సిగ్నల్ వస్తే 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి.

ఆటంకాలు ఎదురైనా కానీ పాత జీవోలు రిజర్వేషన్ల ప్రకారం ఖరారు చేసి వారంలో మళ్లీ నోటిఫికేషన్ వచ్చేలా ఎన్నికల సంఘం అప్రమత్తమవుతోంది. తాము 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నాం కానీ విపక్షాలు ఆటంకాలు కలిగించాయని, అందుకే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికి 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన స్థానాల్లో బీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇప్పటికే అధిష్టానానికి చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసి ల పేర్లు అందాయి. అధికారికంగా రిజర్వేషన్లు రాకపోయినా బీసీలకు కేటాయించిన స్థానాల్లో ఆ సామాజిక వర్గం వారికి సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఇదే తరుణంలో అన్ని రకాలుగా ఆలోచన చేసే జీవోలు ఇచ్చారని స్థానిక ఎన్నికలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: