కమెడియన్ మహేష్ మనందరికీ సుపరిచితమే . ఈ మధ్య పెద్దగా చిత్రాల్లో కనిపించడం లేదు ఈ కమెడియన్ . అప్పట్లో వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఫ్యాన్ బకెట్ సిరీస్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ కమెడియన్ అనంతరం బిగ్ బాస్ లో కనిపించి అలరించాడు . దాని తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ కాలేకపోయాడు . అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో పడ్డ కష్టాలను వివరించుకున్నాడు ఈ నటుడు .


" నేను కాలేజీ అయిపోగానే ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పా . ఎంసీఏ చేసిన తరువాత కొన్ని రోజులు జాబ్ చేసి మానేశాను . ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలనే తపనతో వచ్చాను . రాగానే నాకు ఫన్ బకెట్  లో ఛాన్స్ వచ్చింది . కానీ అనుకోకుండా నేనే నటించాను . అప్పుడు కూడా నాకు పెద్దగా శాలరీ రాలేదు . రూమ్ రెంట్ కే డబ్బులు అన్ని సరిపోయేవి . తినడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు . అందుకే ఆఫీసుకు వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని . ఎవరైనా అడిగితే డైరెక్టర్ హరీష్ పిలిచారని అబద్దం చెప్పేవాడిని .


హరీష్ణ పరిస్థితి అర్థం చేసుకొని నాకు 50 రూపాయలు ఇచ్చి వెళ్లి తిని రమ్మనేవాడు . అలా నన్ను ఐదేళ్లు పాటు చంటి పుల్లాడి లాగా చూసుకున్నాడు . ఆయన అంటే ఎంతో ఇష్టం . అనంతరం చాలా చిత్రాలలో చాన్సులు వచ్చాయి . పేరు అయితే సంపాదించా గానీ డబ్బు మాత్రం సంపాదించలేకపోయాను . ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు . ఉన్నంతలోనే సంతోషంగా ఉంటున్నా " అంటూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు . ప్రజెంట్ మహేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: