నిన్నటి రోజు నుంచి తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఒక హై డ్రామా నెలకొంది.. అదేమిటంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలోని భూములను కబ్జా చేస్తున్నారని కొండ సురేఖ కూతురు సంచలన ఆరోపణలు చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొంతమంది వ్యక్తులు దారి కోసం ఎండోమెంట్ భూమిని అడిగారని, అది ఇస్తే ఖచ్చితంగా పక్కన ఉండే ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పారట. దీంతో అందుకు సంబంధించి ఫైల్ మీద మంత్రి కొండా సురేఖ సంతకం చేయగా, జపాన్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫైల్ ని ఆపారని తెలుస్తోంది.


అలా ఆపడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆపేసారంటూ కొండ సురేఖ కూతురు సుస్మిత పలు ఆరోపణలు చేసింది. అంతేకాకుండా  ఢిల్లీలో జరిగినటువంటి  ఖర్గే మీటింగ్ లో మా అమ్మను రేవంత్ రెడ్డి తిడితే ఆరోజు మా అమ్మ చాలా ఏడ్చింది అంటూ తెలియజేసింది సుస్మిత.అయితే ఇలాంటి ఆరోపణలను వాస్తవంగా ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ,బిజెపి వంటి పార్టీలు ఆసరాగా తీసుకొని మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదనే విధంగా కనిపిస్తోంది.


ఇప్పటివరకు అయితే కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడలేదు అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలువురు మంత్రులు కొండా సురేఖకు సంఘీభావం తెలిపినట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రజాభవన్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత కూడా భేటీ అయి మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే కొండ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ విషయం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: